బిగ్ బాస్ 9.. అయేషా ప్రస్తావన లేదేంటి ఫ్యాన్స్ అప్సెట్..!
బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ గా వచ్చిన బ్యూటీ అయేషా. తమిళ్, తెలుగు సీరియల్స్ తో ఆడియన్స్ కు పరిచయం ఉన్న ఈ అమ్మడు హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.;
బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ గా వచ్చిన బ్యూటీ అయేషా. తమిళ్, తెలుగు సీరియల్స్ తో ఆడియన్స్ కు పరిచయం ఉన్న ఈ అమ్మడు హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. హౌస్ లోకి వచ్చీ రాగానే ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మీద ఎటాక్ కి దిగింది. రీతు చౌదరి, తనూజ ఇలా స్ట్రాంగ్ గా ఉన్న వారిని టార్గెట్ చేస్తూ మంచి కంటెంట్ ఇచ్చింది. ఐతే ఆమె వాయిస్ పవర్ చూసి ఈ సీజన్ లో చివరి దాకా అమ్మడు ఉంటుందనే అనుకున్నారు. కానీ ఆమె అన్ హెల్తీ నెస్ వల్ల అయేషాను హౌస్ నుంచి బయటకు పంపించేశారు. అయేషాకు హెల్త్ సరిగా లేదని టైఫాయిడ్, డెంగ్యూ లక్షణాలు ఉండటం వల్ల హౌస్ నుంచి బయటకు వెళ్లాలని బిగ్ బాస్ చెప్పడంతో ఆమె వెళ్లింది.
హౌస్ నుంచి అయేషా బయటకు..
ఐతే అయేషాకు హెల్త్ సరిగా లేదన్న మాట వాస్తవమే కానీ.. ఆమె ట్రీట్ మెంట్ కి వెళ్లి తిరిగి రావొచ్చు. అంతేకాదు శుక్రవారం ఎపిసోడ్ లో అయేషా హౌస్ నుంచి బయటకు వెళ్లింది. హౌస్ నుంచి అయేషా బయటకు వెళ్లిన విషయం గురించి హోస్ట్ నాగార్జున అసలు ప్రస్తావన తీసుకు రాలేదు. సో అయేషా తనంతట తానే హౌస్ లో ఉండలేక వెళ్లిపోయి ఉండొచ్చు అందుకే హోస్ట్ నాగార్జున ఆమె పేరు ఎత్తలేదని అనుకుంటున్నారు.
రీజన్స్ ఏవైనా సరే వైల్డ్ కార్డ్ గా వచ్చిన అయేషా బయటకు వెళ్లింది. ఆ విషయం అసలు హోస్ట్ కి తెలియదు అన్నట్టుగా ప్రవర్తించడం అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఇక ఉన్న రెండు వారాల్లోనే అయేషా తన చలాకీతనంతో ఆడియన్స్ ని అలరించింది. ఆమె గొడవ పడ్డా కూడా టాస్క్ తర్వాత మళ్లీ అందరితో క్లోజ్ గా ఉంటూ వచ్చింది. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 6లో 9 వారాల దాకా ఉన్న అయేషా 9 వ వారం ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగులో వైల్డ్ కార్డ్ గా వచ్చి రెండో వారమే హౌస్ నుంచి బయటకు వెళ్లింది.
అయేషాని మిస్ అవుతున్న ఆడియన్స్..
బిగ్ బాస్ సీజన్ 9లో ఒక వారం ఎలిమినేషన్ ప్రాసెస్ కి అడ్డు పడేలా అయేషా నిర్ణయం షాక్ ఇచ్చింది. అయేషా వెళ్లింది కాబట్టి ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వారిలో నుంచి ఒకరిని హౌస్ లోకి తీసుకొస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా హౌస్ లో అయేషాని ఆడియన్స్ మిస్ అవుతున్నారు.. ఆమె లేకపోవడం.. ఆమె గురించి ఎవరు ప్రస్తావించకపోవడం అయేషా ఫ్యాన్స్ ని అప్సెట్ అయ్యేలా చేస్తుంది.