బిగ్ బాస్ 9.. షాకింగ్ ఎలిమినేషన్..!
బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ వీక్ పూర్తవుతుంది. శనివారం ఎపిసోడ్ లో వారం మొత్తం జరిగిన దాన్ని రివ్యూ చేస్తూ ఒక్కొక్కరి గురించి నాగార్జున మాట్లాడారు.;
బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ వీక్ పూర్తవుతుంది. శనివారం ఎపిసోడ్ లో వారం మొత్తం జరిగిన దాన్ని రివ్యూ చేస్తూ ఒక్కొక్కరి గురించి నాగార్జున మాట్లాడారు. ఇక నామినేషన్స్ లో ఉన్న 9 మందిలో తనూజాని శనివారం సేవ్ చేశారు నాగార్జున. తనూజ ఒక సీరియల్ యాక్ట్రెస్ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 9 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా తనూజ వచ్చింది. ఇక ఇంకా నామినేషన్స్ లో డీమాన్ పవన్, శ్రష్ట్రి వర్మ, ఇమ్మాన్యుయెల్, సంజన, ఫ్లోరా షైనీ, సుమన్ శెట్టి, రీతు చౌదరి ఉన్నారు.
సీజన్ 9 లో ఎవరు మొదటి ఎలిమినేట్..
వీరిలో నుంచి ఒకరు ఈరోజు హౌజ్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఐతే ఆల్రెడీ ఎలిమినేషన్ షూట్ కంప్లీట్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 9 లో ఎవరు మొదటి ఎలిమినేట్ అయ్యిందో లీక్ అయ్యింది. సీజన్ 9 మొదటి వార ఒక సెలబ్రిటీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వీక్ డీమాన్ పవన్, శ్రష్టి వర్మకు లీస్ట్ ఓటింగ్ వచ్చాయని తెలుస్తుంది. వారిలో శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ ఎలిమినేషన్ షాకింగ్ గా ఉంది. ఎందుకంటే డ్యాన్సర్ గా, కంపోజర్ గా శ్రష్టికి మంచి ఫాలోయింగ్ ఉందనిపించింది.
ఐతే హౌస్ లోకి వెళ్లి ఉమెన్ పవర్ ఏంటో చూపిస్తా.. ఏదైనా తప్పు జరిగితే నిలదీస్తా అంటూ చెప్పిన శ్రష్టి ఈ వారం జరిగిన గొడవల్లో కేవలం ప్రేక్షక పాత్ర వహించింది. కొన్నిసార్లు ఆమె హౌస్ లో ఉందా లేదా అన్నట్టుగా అనిపించింది. బిగ్ బాస్ సీజన్ 9 లో శ్రష్టి వర్మ ఎలిమినేషన్ సర్ ప్రైజ్ చేస్తుంది. డ్యాన్సర్ గా ఎంతోమంది ప్రేక్షకులను అలరించిన శ్రష్టి సీజన్ 9 మొదటి వారమే ఎలిమినేట్ అవ్వడం చూస్తుంటే ఆడియన్స్ ఎవరిని ఉంచాలో ఎవరిని పంపించాలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నట్టు అనిపిస్తుంది.
ఈ వారంలో తన మార్క్ చూపించలేదు..
ప్రతి బిగ్ బాస్ సీజన్ లో ఒక డ్యాన్సర్ ని ఉంచుతారు. హౌస్ లో జరిగే రకరకాల ఈవెంట్స్ కి డ్యాన్స్ కంపోజ్ చేసేలా వాళ్లను తీసుకుంటారు. ఐతే ఈసారి రాము రాథోడ్ కూడా సింగర్ కం డ్యాన్సర్ వచ్చాడు. శ్రష్టి ఈ వారంలో తన మార్క్ చూపించలేదు. అందుకే ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.
బిగ్ బాస్ ఆడియన్స్ కూడా వాళ్లని టాస్క్ ల పరంగా గానీ.. లేదా కంటెంట్ ఇస్తూ వాలిడ్ పాయింట్స్ మాట్లాడుతున్న వారిని మాత్రమే హౌస్ లో ఉంచాలని చూస్తున్నారు. అందుకే ఈ ఎలిమినేషన్ వల్ల సెలబ్రిటీస్ కి కూడా ఆడితేనే హౌస్ లో ఉంటామన్న ఒక ఆలోచన వస్తుంది.