గౌరవ్ వర్సెస్ దివ్య.. నిఖిల్ ని బకరా చేసిన రెబల్స్..!
బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారం హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. కంటెండర్ రేసులో ఎవరెవరు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది.;
బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారం హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. కంటెండర్ రేసులో ఎవరెవరు ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఐతే ఈ టాస్క్ లో రెబల్స్ గా దివ్య, సుమన్ శెట్టి అందరినీ భలే బకరాలను చేస్తున్నారు. దివ్య, సుమన్ శెట్టి ఇద్దరికీ కూడా సీక్రెట్ టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. అలా వీరిద్దరు ముందు కళ్యాణ్ ని ఈ టాస్క్ నుంచి తప్పించారు. మరోపక్క దివ్య, సుమన్ బిగ్ బాస్ ఇచ్చిన పాలు దొంగతనం టాస్క్ కూడా పూర్తి చేయడంతో వాళ్లకు మరొకరిని కంటెండర్ రేసు నుంచి తప్పించే ఛాన్స్ ఇచ్చారు.
హౌస్ లో కిచెన్ డిపార్ట్ మెంట్ లో గొడవలు..
సో కళ్యాణ్ ఆఫ్టర్ నిఖిల్ రేసు నుంచి తొలగించబడ్డాడు. ఐతే నిఖిల్ కి ఈ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయ్యాడన్న విషయాన్ని ఇమ్మాన్యుయెల్ ద్వారా ఫోన్ లో చెప్పాడు బిగ్ బాస్. ఐతే రెబల్స్ గా దివ్య, సుమన్ ఇద్దరు మంచి ప్రదర్శన ఇస్తున్నారు. ఇక హౌస్ లో కిచెన్ డిపార్ట్ మెంట్ లో గొడవలు అనేవి చాలా కామన్ అని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఎందుకంటే గౌరవ్ వర్సెస్ దివ్య గొడవ జరిగింది. గౌరవ్ ఆంలేట్ వేయమంటే లేడని దివ్యకు కంప్లైంట్ వెళ్లింది.
గౌరవ్ అది లంచ్ టైం కి కదా అని అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్లాఉ. అతను వెళ్లే టైం లో ఎవరో ఒకరిని కిచెన్ లో ఉంచాలి అది జరగలేదు. దివ్య ఈ విషయంపై గౌరవ్ ని కిచెన్ నుంచి వాష్ రూం క్లీనింగ్ షిఫ్ట్ చేస్తా అన్నది. గౌరవ్ దానికి ఒప్పుకోలేదు. చేయకపోతే నీకు ఫుడ్ ఉండదని దివ్య వార్నింగ్ ఇచ్చింది. కెప్టెన్ గా తనకు అధికారం ఉందని దివ్య కాస్త అతి చేసిందనే అనిపిస్తుంది.
దివ్య వర్సెస్ గౌరవ్ గొడవలో దివ్య కాస్త యాటిట్యూడ్ చూపించిందని..
ఫైనల్ గా సంజన వచ్చి తను వాష్ రూం కి షిఫ్ట్ చేసుకుని గౌరవ్ ని వెజెల్స్ క్లీనింగ్ కి షిఫ్ట్ చేసింది. నిఖిల్, గౌరవ్ వెజెల్స్ క్లీనింగ్ చేయడానికి ఒప్పుకోగా సంజన, ఇమ్మాన్యుయెల్ బాత్ రూంస్ కడగడానికి ఫిక్స్ అయ్యారు. దివ్య వర్సెస్ గౌరవ్ గొడవలో దివ్య కాస్త యాటిట్యూడ్ చూపించిందని అనిపిస్తుంది. కెప్టెన్ గా తను ఆర్డర్స్ వేయడం కరెక్టే కానీ ఫుడ్ ఉండదు అని చెప్పడంపై గౌరవ్ బాగా హర్ట్ అయ్యాడు. ఈ విషయం పై నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో మాట్లాడతారేమో చూడాలి.
దివ్య తో కలిసి సుమన్ సీక్రెట్ టాస్క్ ని అదరగొట్టేస్తున్నాడు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో ఈ ఇద్దరు ఉండే అవకాశం ఉంది. వీరితో పాటు ఆల్రెడీ గ్రీన్ కార్డ్ వచ్చిన ఇమ్మాన్యుయెల్, తనూజ కూడా కెంటెన్సీ కంటెండర్ గా పోటీలో ఉండనున్నారు.