బిగ్ బాస్ 9.. వైల్డ్ కార్డ్ ఫైనల్ లిస్ట్ ఇదేనా..?
బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీ కి టైం వచ్చేసింది. ప్రతి సీజన్ లానే సీజన్ మొదలైన ఐదు వారాల్లో వైల్డ్ కార్డ్ గా కొందరు కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు.;
బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీ కి టైం వచ్చేసింది. ప్రతి సీజన్ లానే సీజన్ మొదలైన ఐదు వారాల్లో వైల్డ్ కార్డ్ గా కొందరు కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు. గత రెండు సీజన్లుగా బిగ్ బాస్ సెకండ్ వెర్షన్ అంటూ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సీజన్ 9 లో కూడా ఈ వారం 2.ఓ కూడా ఈ వీకెండ్ మొదలవుతుంది. ఈ క్రమంలో సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా రెడీ అయ్యారు. ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఆరుగురు హౌస్ లోకి వస్తారని టాక్. ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్స్ మరింత వైల్డ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మరో సీరియల్ యాక్టర్..
ముందుగా ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మరో సీరియల్ యాక్టర్ ఐషా వస్తుందని తెలుస్తుంది. తమిళ, తెలుగు భాషల్లో సీరియల్ యాక్టర్ గా ఐషా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. స్టార్ మా సీరియల్స్ లో ఆమె నటిస్తుంది. ఈమధ్య కొన్ని స్టార్ మా ఈవెంట్స్ లో కూడా ఐషా కనిపిస్తుంది. ఐషా బిగ్ బాస్ సీజన్ 6 తమిళ్ లో కూడా పాటిస్పేట్ చేశారు. ఆ సీజన్ లో దాదాపు ఆమె 9 వారాల దాకా ఉన్నారని తెలుస్తుంది.
నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో వైల్డ్ కార్డ్ గా ఆర్టిస్ట్ శ్రీనివాస్ సాయి సెలెక్ట్ అయ్యాడట. గోల్కొండ హైస్కూల్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన శ్రీనివాస్ సాయి కొన్ని సినిమాల్లో హీరో ఫ్రెండ్ రోల్స్ చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ మరో సీరియల్ యాక్టర్ గౌరవ్ గుప్తా కూడా ఈ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తున్నాడట. అతను గీతా ఎల్.ఎల్.బి సీరియల్ లో నటించాడు.
సోషల్ మీడియాలో మోస్ట్ కాంట్రవర్షియల్..
ఆ తర్వాత మరో వైల్డ్ కార్డ్ గా నిఖిల్ నాయర్ కూడా హౌస్ లోకి వస్తున్నాడని తెలుస్తుంది. అతను కూడా పలుకే బంగారమాయనే సీరియల్ ద్వారా పాపులర్ అయ్యాడు. ఇక వీరితో పాటు సోషల్ మీడియాలో మోస్ట్ కాంట్రవర్షియల్ అయిన అలేఖ్య పికిల్స్ రమ్య కూడా సీజన్ 9లో వైల్డ్ కార్డ్ గా వస్తున్నట్టు తెలుస్తుంది. అసలైతే ఆమెను ఈ సీజన్ మొదట్లోనే తీసుకొస్తారన్న టాక్ వచ్చింది. కానీ రమ్య తను వైల్డ్ కార్డ్ గా వెళ్తానన్న ఛాయిస్ ఎంపిక చేసుకుందని తెలుస్తుంది.
ఇక నెక్స్ట్ ఇదే లిస్ట్ లో దివ్వెల మాధురి కూడా ఉన్నారు. ఆమె కూడా బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తున్నారని తెలుస్తుంది. సో ఈ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో కూడా డిఫరెంట్ కంటెస్టెంట్స్ వస్తున్నారు. తప్పకుండా వీళ్లు హౌస్ లోకి వెళ్లిన తర్వాత హౌస్ లో ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్ ఆట కూడా మారే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.