ఆమెను దగ్గరుండి గెలిచిపించే పనిలో ఇమ్మాన్యుయెల్..?

బిగ్ బాస్ సీజన్ 9లో ఇమ్మాన్యుయెల్ తన ఆటలో దూసుకెళ్తున్నాడు. అతనితో పాటు పోటీగా టాప్ 5 రేసులో ఉంది సీరియల్ యాక్టర్ తనూజ.;

Update: 2025-10-27 11:30 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో ఇమ్మాన్యుయెల్ తన ఆటలో దూసుకెళ్తున్నాడు. అతనితో పాటు పోటీగా టాప్ 5 రేసులో ఉంది సీరియల్ యాక్టర్ తనూజ. ఐతే ఈ ఇద్దరు బిగ్ బాస్ కి వెళ్లడానికి ముందే స్టార్ మాలో వచ్చిన కుకు విత్ జాతిరత్నాలు ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఇద్దరికీ కూడా అక్కడ బాగానే పరిచయం ఉంది. ఐతే ఈ సీజన్ లో ఇమ్మాన్యుయెల్ కి తనూజ గట్టి పోటీ ఇస్తుంది. ప్రస్తుతం ఆమె టాప్ ప్లేస్ లో కొనసాగుతుందని ఓటింగ్ పర్సెంటేజ్ ద్వారా తెలుస్తుంది.

లాస్ట్ వీక్ కళ్యాణ్ తో ఇమ్మాన్యుయెల్ ప్లాన్..

ఐతే తనూజ లేడీ విన్నర్ అవుతుందని తెలిసి హౌస్ మెట్స్ అంతా కూడా ఆమెనే టార్గెట్ చేస్తున్నారు. పోటీగా ఉన్న ఇమ్మాన్యుయెల్ కూడా ఆమెను ప్రతి వారం నామినేషన్స్ లో వేసే ప్లానింగ్ చేస్తున్నాడు. లాస్ట్ వీక్ కళ్యాణ్ తో నామినేషన్ వేయించాలని ప్లాన్ చేసిన ఇమ్మాన్యుయెల్ ఈ వారం డైరెక్ట్ గా అతనే చేశాడు. ఐతే ఇమ్మాన్యుయెల్ ఓ పక్క తన సేఫ్ గేమ్ తను ఆడుతూ తనూజ తనకు పోటీ వస్తుందని ఆమెను నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేసేలా ప్రయత్నిస్తున్నాడు.

కానీ అతను చేస్తున్న ఈ టార్గెట్ వల్ల ఆడియన్స్ తనూజకి మరింత సపోర్ట్ గా ఉంటున్నారు. ఇమ్మాన్యుయెల్, తనూజ బయట క్రేజ్ విషయంలో ఎవరిది వారికే ఉన్నా సీరియల్ ఆడియన్స్ అంతా కూడా తనూజ మీద అభిమానం చూపిస్తున్నారు. అంతేకాదు హౌస్ లో అందమైన అమ్మాయి అంటే అది తనూజనే అనేలా ఆమె కనిపిస్తుంది. అందుకే తనూజ హౌస్ లో ఉండాలి టాప్ లో ఉండాలని ఆడియన్స్ కోరుతున్నారు.

తనూజ దగ్గర కూడా మైనస్ లు..

తనూజ దగ్గర కూడా మైనస్ లు ఉన్నాయి.. ప్రతి చిన్న విషయానికి టెంపర్ అవ్వడం.. ఏడవడం ఆమె చేస్తుంది. ఐతే ఏ విషయాన్ని ఎక్కడ వదిలేయాలి అన్నది కాస్త తెలివిగా ప్రవర్తిస్తుంది. లాస్ట్ వీక్ కూడా తనూజ నామినేషన్స్ విషయంలో ఇమ్మాన్యుయెల్ కళ్యాణ్ తో గొడవ వేసుకున్నాడు. వీకెండ్ లో నాగార్జున అడిగితే మాత్రం సేఫ్ ఆన్సర్ ఇచ్చాడు ఇమ్మాన్యుయెల్. ఇప్పుడు మళ్లీ ఈ వారం అతనే తనూజని నామినేట్ చేశాడు.

ఇలా ఇమ్మాన్యుయెల్ తనూజని టార్గెట్ చేసిన ప్రతిసారి ఆమె గ్రాఫ్ పెరుగుతుంది. అంతేకాదు పరిస్థితి చూస్తుంటే ఇమ్మాన్యుయెల్ దగ్గర ఉండి ఆమెను గెలిపించేలా ఉన్నాడనిపిస్తుంది. ఇమ్మాన్యుయెల్ దగ్గర పవర్ అస్త్ర ఉంది. తనూజ దగ్గర డైల్మండ్ పవర్ ఉంది. ఈ ఇద్దరు కచ్చితంగా టాప్ 5కి చేరుకుంటారని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. మరి నెక్స్ట్ రాబోయే వారాల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News