హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్.. వచ్చీ రాగానే బ్లాస్ట్..!

బిగ్ బాస్ సీజన్ 9 లో 3వ వారం సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేస్తున్నాయి.;

Update: 2025-09-26 03:51 GMT

బిగ్ బాస్ సీజన్ 9 లో 3వ వారం సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేస్తున్నాయి. సీజన్ 9లో గురువారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ లోకి కొత్త కంటెస్టెంట్ ఒకరు హౌస్ లోకి వచ్చారు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన 13 మెంబర్స్ లో ఆరుగురు ఆల్రెడీ హౌస్ లోకి వచ్చారు. ఐతే మిగతా వారిలో నుంచి నలుగురిని హౌస్ లోకి పంపించి వారి నుంచి ఒకరిని హౌస్ మెట్స్ ఎంపిక ద్వారా కంటెస్టెంట్ గా హౌస్ లోకి పంపించాలని అనుకున్నారు. ఐతే ఈ క్రమంలో కంటెస్టెంట్స్ అందరు యాక్టివిటీ ఏరియాలో ఏర్పాటు చేసిన బాక్సుల్లో తమకు ఎవరు రావాలని ఉందో వారి ఫోటో బాక్స్ లో వేశారు.

దివ్య మంచి టఫ్ ఫైటర్..

ఐతే బిగ్ బాస్ సీజన్ 9 లో అన్ని ట్విస్ట్ లే ఉంటాయి కాబట్టి హౌస్ మెట్స్ మెజారిటీగా ఎంపిక చేసిన వారిని కాకుండా లీస్ట్ ఓటింగ్ వచ్చిన వాళ్లని హౌస్ లోకి పంపించాడు. ఆమె ఎవరో కాదు దివ్య నిఖిత. దివ్యాకు అందరి కన్నా తక్కువ ఓట్స్ రాగా.. ఆమెను హౌస్ లోకి పంపించారు. ఐతే దివ్య అగ్నిపరీక్ష టైం లోనే మంచి టఫ్ ఫైటర్ అనిపించింది. ఆమెను హౌస్ లోకి ఆహ్వానిచారు.

ఇక వచ్చీ రాగానే హౌస్ లో తన ఆట మొదలు పెట్టేసింది దివ్య. హౌస్ లో అందరి గురించి మాట్లాడుతూ ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, మరో స్క్వేర్ స్టోరీ నడుస్తుందని అన్నది. ట్రయాంగిల్ అనగానే కల్యాణ్, పవన్, రీతులదే అని అందరు ఫిక్స్ అయ్యారు. ఐతే స్క్వేర్ లవ్ స్టోరీ అని తనూజ, కళ్యాణ్ పేరు చెప్పగానే తనూజ అప్సెట్ అయ్యింది. దివ్య తాను ఎందుకు అలా చెప్పానంటే హౌస్ లోకి రాగానే ఇలా చెప్పడం వల్ల దాని మీద డిస్కషన్ నడుస్తుంది అది తన ప్లాన్ అని కెమెరా ద్వారా బిగ్ బాస్ కి చెప్పింది.

బిగ్ బాస్ అగ్నిపరీక్షలో సత్తా చాటి..

మొత్తానికి బిగ్ బాస్ అగ్నిపరీక్షలో సత్తా చాటిన దివ్య నిఖిత బిగ్ బాస్ సీజన్ 9 లో భాగం అవుతుంది. తప్పకుండా హౌస్ లో ఆమె తన మార్క్ చూపిస్తుందనే అనిపిస్తుంది. అగ్నిపరీక్ష మెంబర్స్ వచ్చాక అనూష, దివ్య ఇద్దరు కూడా శ్రీజ మీద అసంతృప్తిగా ఉన్న విషయాన్ని చెప్పారు. మరి దివ్యా హౌస్ లోకి వెళ్లింది ఇంకా అది కొనసాగిస్తుందా లేదా అన్నది చూడాలి.

బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ మిడ్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆడియన్స్ ని నిజంగానే సర్ ప్రైజ్ చేసింది. తప్పకుండా ఈ సీజన్ ఇలానే సర్ ప్రైజ్ లతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలని ఆశిస్తున్నారు.

Tags:    

Similar News