బిగ్ బాస్ 9.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ షాకింగ్..!
బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం ఆరుగురు హౌస్ మెట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.;
బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం ఆరుగురు హౌస్ మెట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ నామినేషన్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. భరణి, సుమ శెట్టి, దివ్య, తనూజ, డీమాన్ పవన్, రాము ఈసారి నామినేషన్స్ లో ఉన్నారు. ఐతే వారిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అసలు ఆయన టాప్ 5కి పక్కా అనుకున్న కంటెస్టెంట్ ఈరోజు ఎలిమినేట్ కాబోతున్నాడు. ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 9 సండే ఎపిసోడ్ షూటింగ్ పూర్తైంది. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ గా ఇది ఉండబోతుంది. కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఈరోజు షోకి వస్తారని తెలుస్తుంది.
సీరియల్స్ లో స్టార్ విలన్ గా..
బిగ్ బాస్ సీజన్ 9లో ఈరోజు వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ భరణి ఎలిమినేట్ అవుతున్నాడు. ఇది కచ్చితంగా హౌస్ మెట్స్ కి మాత్రమే కాదు ఆడియన్స్ కి కూడా షాక్ అయ్యేలా ఉంటుంది. సీరియల్స్ లో విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ తో అలరిస్తూ వస్తున్న భరణి శంకర్ ఈ సీజన్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించారు. ఐతే హౌస్ లో ఆయన టాస్క్ ల కన్నా రిలేషన్స్ షిప్ బిల్డ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారు.
మొదటి వారం నుంచి తనూజతో ఉన్న ఆయన సడెన్ గా దివ్య ఎంట్రీతో ఆమెతో క్లోజ్ గా ఉంటున్నారు. ఆట ఎటు వెళ్తుంది అన్నది పట్టించుకోకుండా ఇలా రిలేషన్ షిప్ చట్రంలో ఇరుక్కుపోయాడు భరణి. అదే అతన్ని దెబ్బ తీసింది. హౌస్ లో టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఉందా అంటే అది లేదు. పోనీ ఏ విషయంలో అయినా స్టాండ్ తీసుకుని నిలబడుతున్నారా అంటే అది లేదు. లాస్ట్ వీక్ ఆల్రెడీ ఒక ఆడియన్ తో భరణికి తన ఆట గురించి చెప్పి ఇలానే ఉంటే హౌస్ లో ఉంచాలని లేదని చెప్పినా కూడా ఈ వారం దివ్యాతో ఎమోషనల్ అవ్వడం చేశాడు భరణి.
బంధాలు అనుబంధాల వల్ల హౌస్ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి..
ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 9 లో 6వ వారం భరణి ఎలిమినేట్ అవుతున్నాడు. మొదటి రెండు వారాలు స్ట్రాంగ్ గా అనిపించిన భరణి ఈ బంధాలు అనుబంధాల వల్ల హౌస్ నుంచి బయటకు వెళ్లే పరిస్థితి వచ్చింది. హౌస్ లో తన ఆట సరిగా లేదని ఆడియన్స్ తమ జడ్జిమెంట్ ఇచ్చారు. ఐతే భరణి ఎలిమినేషన్ టైం లో తనూజ బాగా ఎమోషనల్ అయ్యిందని తెలుస్తుంది. ఏకంగా నాగార్జున కన్ ఫెషన్ రూం కి పిలిచి మరీ ఆమెను ఓదార్చాడని తెలుస్తుంది.
సో దీపావళి ఎపిసోడ్ మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు బిగ్ బాస్ ఆడియన్స్ కి ఎమోషనల్ మూమెంట్ కూడా ఉండబోతుంది. భరణి ఎలిమినేషన్ కచ్చితంగా ఆడియన్స్ కి షాక్ ఇస్తుంది. ఐతే అది ఎలా జరుగుతుంది అన్నది ఎపిసోడ్ లో చూడాల్సిందే.