బిగ్ బాస్ 9.. టాప్ 5 ఛాన్సెస్ ఎవరికి ఫైర్ స్టోర్మ్ ఎఫెక్ట్ ఎంత..?
బిగ్ బాస్ సీజన్ 9లో ఆరు వారాల ఆట ముగిసింది. ఇప్పటికే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు వైల్డ్ కార్డ్ గా ఫైర్ స్టోర్మ్ తో వచ్చిన కంటెస్టెంట్స్ కూడా తమ మార్క్ చూపిస్తున్నారు.;
బిగ్ బాస్ సీజన్ 9లో ఆరు వారాల ఆట ముగిసింది. ఇప్పటికే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు వైల్డ్ కార్డ్ గా ఫైర్ స్టోర్మ్ తో వచ్చిన కంటెస్టెంట్స్ కూడా తమ మార్క్ చూపిస్తున్నారు. ఐతే హౌస్ లో ఉన్న వారిలో ఇప్పటివరకు జరిగిన ఆటలో ఎవరు ఆడియన్స్ మనసులో ముందుకు వెళ్తున్నారు. ఎవరు ఆటలో వెనక్కి తగ్గుతున్నారన్నది ఒక లెక్క ఉంటుంది. కొంతమంది కంటెస్టెంట్స్ వారాలు గడుస్తున్నా కొద్దీ ఆటలో తమ నెక్స్ట్ లెవెల్ స్టెప్ తో దూసుకెళ్తున్నారు.
ఆడియన్స్ లో ఎక్కువ ఫాలోయింగ్..
మరికొంతమంది మాత్రం ఉన్న స్థానం నుంచి గ్రాఫ్ పడిపోయేలా చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఫైర్ స్టోర్మ్ కాకుండా పాత కంటెస్టెంట్ లో ఇమ్మాన్యుయెల్, సంజన, తనూజ స్ట్రాంగ్ గా ఉన్నారు. వాళ్లు ఆట పరంగా కన్నా ఆడియన్స్ లో ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఈ ముగ్గురికి దాదాపు టాప్ 5 లో స్థానం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక భరణి తను పెట్టుకున్న బాండింగ్ బ్రేక్ చేస్తే కానీ ముందుకు కొనసాగే ఛాన్స్ కనిపించట్లేదు.
అతనికి టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఉంది కానీ టాస్కుల్లో సరిగా పర్ఫార్మ్ చేయకపోగా లేని పోని బంధాల వల్ల వెనకపడుతున్నాడు. సుమన్ శెట్టి ప్రతి వారం తన ఆట మెరుగుపరచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈ వారం కెప్టెన్ గా గెలిచి అదరగొట్టాడు. సుమన్ శెట్టి నిజాయితీని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక మిగిలిన వారిలో డీమాన్ పవన్ రీతు వాళ్ల రిలేషన్ ని పక్కన పెట్టి ఆట మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.
టాస్క్ లో ఓడిపోతే రకరకాలుగా ప్రవర్తించి..
కళ్యాణ్ కూడా లాస్ట్ వీక్ బాగా ఆడి కెప్టెన్ అయ్యాడు.. ఈ వారం మళ్లీ ఎలాంటి పఫార్మెన్స్ లేదు. అతను ఇంకా బాగా కష్టపడాలి. ఇక ఫైర్ స్టోర్మ్ గా వచ్చిన వారిలో అయేషా చలాకీ తనం బాగుంది. కానీ నిన్న కెప్టెన్సీ టాస్క్ లో ఓడిపోతే రకరకాలుగా ప్రవర్తించి ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. తను కాస్త ప్లానింగ్ తో ఆడితే టాప్ 5 లో ఉండొచ్చు. గౌరవ్ కూడా బాగానే ఆడుతున్నాడు. అతను కూడా హౌస్ మెట్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. ఇక మాధురి, శ్రీనివాస్ సాయి, రమ్య నామినేషన్స్ లోకి వస్తే వెళ్లిపోయేలా ఉన్నారు.
ఓల్డ్ కంటెస్టెంట్ గా రాము రాథోడ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాల్సి ఉంది. అతను కూడా రాబోయే వారాల్లో హౌస్ నుంచి బయటకు వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది. సో టాప్ 5 లో ఓల్డ్ కంటెస్టెంట్స్ 3 లేదా 4.. ఫైర్ స్టోర్మ్ అదే వైల్డ్ కార్డ్స్ లో ఒకరిద్దరికి ఛాన్స్ ఉండేలా ప్రస్తుతం పరిస్థితి ఉంది. రాబోయే వారాల్లో ఈ లెక్కలు మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.