బిగ్ బాస్ 9.. సుమన్ కోసం భరణికి ట్విస్ట్..?

ఐతే ఇప్పుడు భరణి ఆ బాక్స్ ఓపెన్ చేయాల్సిన టైం వచ్చింది. ప్రస్తుతం హౌస్ లో తమ ఇంటి నుంచి వచ్చిన మెసేజ్ లను చూసే కార్యక్రమం జరుగుతుంది.;

Update: 2025-09-24 08:48 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో సీరియల్ యాక్టర్ భరణి ఎంట్రీ తెలిసిందే. సెలబ్రిటీ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంటర్ అయిన అతను తన మైండ్ గేం తో ఆట కొనసాగిస్తున్నాడు. హౌస్ లో గొడవలు జరుగుతున్నా కూడా పెద్దగా ఏమి పట్టించుకోకుండా సైలెంట్ గా తన ఆట ఆడుతున్నాడు భరణి. ఐతే భరణి హౌస్ లోకి వెళ్లే టైం లో తనతో పాటు ఒక బాక్స్ తెచ్చాడు. అది తన మదర్ అతనికి ఇచ్చింది. అది లేకపోతే హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయేందుకు కూడా భరణి రెడీ అయ్యాడు. ఐతే బిగ్ బాస్ పర్మిషన్ ఇవ్వడంతో భరణి హౌస్ లోకి వెళ్లాడు.

ఇమ్మాన్యుయెల్ ఇంటి నుంచి ఫోటో..

ఐతే ఇప్పుడు భరణి ఆ బాక్స్ ఓపెన్ చేయాల్సిన టైం వచ్చింది. ప్రస్తుతం హౌస్ లో తమ ఇంటి నుంచి వచ్చిన మెసేజ్ లను చూసే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో నిన్నటి ఎపిసోడ్ లో ఇమ్మాన్యుయెల్ ఇంటి నుంచి ఒక ఫోటో 25 పర్సెంట్ బ్యాటరీ డౌన్ చేసి తీసుకున్నాడు. ఇక నెక్స్ట్ ఈరోజు తనూజ, సంజన, సుమన్ శెట్టి కన్ ఫెషన్ రూం లో పిలిచి వాళ్లకు ఫ్యామిలీ నుంచి వచ్చిన మెసేజ్ గురించి చెప్పాడు.

ఐతే లేటెస్ట్ ప్రోమోలో మాత్రం సుమన్ శెట్టికి బ్యాటరీ కేవలం 10 పర్సెంట్ మాత్రమే ఉంటుంది. అది పెరగాలంటే భరణి దగ్గర ఉన్న బాక్స్ ఓపెన్ చేయాలని బిగ్ బాస్ చెబుతాడు. అలా అతన్ని ఒప్పిస్తే మీ బ్యాటరీ చార్జ్ పెరుగుతుందని అన్నాడు. ఐతే ప్రోమోలో భరణి తీస్తాడా లేదా అన్న సస్పెన్స్ ఉంచారు. ఐతే బిగ్ బాస్ లీక్స్ ప్రకారం చూస్తే భరణి సుమన్ శెట్టి కోసం ఆల్రెడీ బాక్స్ ఓపెన్ చేశాడట. దాని వల్ల బ్యాటరీ చార్జింగ్ పెరిగి అతనికి ఫ్యామిలీ నుంచి వచ్చిన మెసేజ్ అందుతుంది.

కామనర్స్ నుంచి మరొకరు హౌస్ లోకి..

సో ఈరోజు ఎపిసోడ్ మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు హౌస్ మెట్స్ మధ్య ఎమోషనల్ రైడ్ గా ఉంటుందని అనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్స్ ఇప్పుడిప్పుడే ఆటలో గురి పెడుతున్నారు. ఐతే ఈ వారం లో మరో ట్విస్ట్ కూడా ఉంటుందని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి చెప్పాడు. అదేంటి అంటే కామనర్స్ నుంచి మరొకరిని హౌస్ లోకి తీసుకెళ్తారట. ఐతే ముగ్గురుని పంపించి వారిలో ఒకరిని హౌస్ లో ఉంచేలా చేస్తారని టాక్.

మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 లో 2.O మొదలు పెట్టకముందే కామనర్స్ ఒకరిని హౌస్ లోకి పంపించి షో క్రేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News