అమెజాన్ ప్రైమ్ వీడియో.. ఏం జరుగుతోంది?

ఈ మధ్యకాలంలో ఓటీటీ ప్లాట్‌ ఫారమ్స్ పెద్ద ఎత్తున క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే.;

Update: 2025-10-13 11:00 GMT

ఈ మధ్యకాలంలో ఓటీటీ ప్లాట్‌ ఫారమ్స్ పెద్ద ఎత్తున క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. వీకెండ్‌ వస్తే కొత్త సినిమాలు ఏవి స్ట్రీమింగ్‌ లోకి వచ్చాయో తెలుసుకుని మరీ ఓటీటీల్లో చూస్తున్నారు. ఇంట్లోనే ఉండి చూడాలనుకున్న చిత్రాలు వీక్షిస్తున్నారు. తద్వారా సినిమాలను వివిధ ఓటీటీల్లో చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి.

అయితే ప్రముఖ ఓటీటీల్లో ఒకటైన అమెజాన్ ప్రైమ్ వీడియోకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అనేక భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎప్పటికప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆడియన్స్ కు కొత్త కొత్త కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. దీంతో అనేక మంది ఓటీటీ లవర్స్.. అమెజాన్ ప్రైమ్ వీడియో వైపు మొగ్గు చూపిస్తున్నారు.

కానీ అమెజాన్ ప్రైమ్ వీడియో సేవల్లో శనివారం నాడు పెద్ద అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. దాదాపు ఇండియా అంతా వినియోగదారులు.. కంటెంట్ ను చూడలేకపోయారు. వీకెండ్ కదా అని ఆయా సినిమాలను, వెబ్ సిరీస్ ను చూద్దామని అనుకున్నారు. కానీ యాప్ చాలా సేపు డౌన్ లో ఉండడంతో అంతా నిరాశ చెందారు.

అంతే కాదు.. సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్ లో వచ్చిన ఎర్రర్ మెసేజ్ స్క్రీన్ షాట్స్ ను షేర్ చేశారు. కంటెంట్ చూసేందుకు అవ్వడం లేదని పోస్టులు పెట్టారు. నిర్వాహకులను ట్యాగ్ చేస్తూ.. కంప్లైంట్ చేశారు. దీంతో నెట్టింట ఎక్కడ చూసినా అమెజాన్ ప్రైమ్ వీడియోకు సంబంధించిన కంప్లైంట్లే కనిపించాయి.

అయితే ఆ తర్వాత తాజాగా.. చాలామంది మూవీ లవర్స్ కు మరో సమస్య ఎదురైంది. కింద సబ్ టైటిల్స్ రావడం లేదు. దీంతో మరోసారి నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కంటెంట్ స్ట్రీమింగ్ లో పదే పదే సమస్యలు ఎదురవుతున్నా.. ఎలాంటి బగ్స్ ను ఫిక్స్ చేయకోకపోవడంతో నెటిజన్లు, ఓటీటీ లవర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే రిపీట్ అయితే మెరుగైన స్ట్రీమింగ్ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని సబ్స్క్రైబర్లు చెబుతున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్ ల మధ్య పెరుగుతున్న ప్రకటనల సంఖ్య గురించి కూడా ఆందోళన చెందుతున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. మరీ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు అమెజాన్ ప్రైమ్ వీడియో.. డౌన్‌ టైమ్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు.

Tags:    

Similar News