• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Press Notes >  బేబీ టీమ్ ను చూస్తే...

బేబీ టీమ్ ను చూస్తే గర్వంగా ఉంది : విజయ్ దేవరకొండ

| సినిమా చూసిన అనంతరం విజయ్ ప్రెస్ తో మాట్లాడారు. తాను సినిమా గురించి మాట్లాడటానికి రాలేదు. ఆడియన్స్ ఈ సినిమా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-07-15 06:10 GMT

ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్ లో నటించిన సినిమా బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎస్.కె.ఎన్ ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా ను సాయి రాజేష్ డైరెక్ట్ చేశారు. సినిమా లోని పాటలు ఆల్రెడీ మంచి బజ్ క్రియేట్ చేయగా ఈ సినిమా కు విజయ్ మ్యూజిక్ అందించారు. టీజర్ ట్రైలర్ లో సినిమా పై సూపర్ బజ్ క్రియేట్ అవగా సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బేబీ సినిమా కు గురువారం సాయంత్రం వేసిన పెయిడ్ ప్రీమియర్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తమ్ముడి సినిమా ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ చూశారు.

సినిమా చూసిన అనంతరం విజయ్ ప్రెస్ తో మాట్లాడారు. తాను సినిమా గురించి మాట్లాడటానికి రాలేదు. ఆడియన్స్ ఈ సినిమా మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. ఇక్కడకు వచ్చిన అందరికీ థాంక్స్.. సాయి రాజేష్ ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఎస్.కె.ఎన్ ధీరజ్ లను చూస్తుంటే కూడా తనకు గర్వంగా ఉందని అన్నారు విజయ్ దేవరకొండ. ఆనంద్ వైష్ణవి విరాజ్ ఇలా అందరు కలిసి ఏడిపించారు. ఈ సినిమా ను చూసి అందరూ ఎంజాయ్ చేయండి.. సినిమా మళ్లీ మాట్లాడుదామని అన్నారు.

ప్రీమియర్ షోస్ తర్వాత నిర్మాత ఎస్.కె.ఎన్ కూడా ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు. రెండున్నరేళ్లుగా కంటెంట్ ను మాత్రమే నమ్మి ఈ సినిమా తీశాం.. స్నేహితుడు సాయి రాజేష్ ఈ సినిమా తీశారు. మాస్ డైలాగ్స్ పంచ్ డైలాగ్స్ తో కాదు కంటెంట్ ని నమ్మే సినిమా తీశాను. టాక్సీవాలా తర్వాత ఈ సినిమా చేయాల ని అనుకున్నా ఇప్పటికి కుదిరింది. ఈ తరం వాళ్లు ప్రేమ లో పడాలన్నా ప్రేమ గురించి తెలుసుకోవాలన్నా బేబీ సినిమా ఒక పుస్తకంలాంటిద ని అన్నారు. ఆనంద్ వైష్ణవి విరాజ్ అద్భుతంగా నటించారు. ఆనంద్ ని నన్ను నమ్మి నా చేతుల్లో పెట్టాడు విజయ్.. బేబీ సంచలనాలు సృష్టించబోతుంది. కల్ట్ బొచ్చ ఇచ్చామని అన్నారు.

ప్రీమియర్స్ కు వచ్చిన రెస్పాన్స్ చూసిన సాయి రాజేష్ ఇంతమంచి రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. నన్ను మొదటి నుంచి నమ్మిన ఎస్.కె.ఎన్ మారుతి గారికి థాంక్స్ అని అన్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఇంత మంచి సినిమా తీసిన సాయి రాజేష్ కు థ్యాంక్స్. ఈ సినిమా తో అతను నా ఫేవరెట్ డైరెక్టర్ అయ్యాడని అన్నారు మారుతి. సాయి రాజేష్ మా ఫ్రెండ్ అవ్వడం గర్వంగా ఉందని అన్నారు. ఎస్.కె.ఎన్ మూడేళ్లు కష్టపడ్డాడు.. ఆనంద్ వైష్ణవి విరాజ్ లు అద్భుతంగా నటించారు. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని అన్నారు మారుతి.

సినిమా హీరో ఆనంద్ దేవరకొండ స్పందిస్తూ ఏం మాట్లాడా లో తెలియడం లేదు. బయట రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. ఇదంతా మన సినిమాకే జరిగిందా అన్న డౌట్ వస్తుంది. థియేటర్ లో అరుపులు వినిపిస్తున్నాయి. ఏడుపులు వినిపిస్తున్నాయి.. నన్ను నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చిన సాయి రాజేష్ అన్న ఎస్.కె.ఎన్ అన్నకి థాంక్స్. వైష్ణవి విరాజ్ ల సీన్లకు నేను అరుస్తున్నానని అన్నారు ఆనంద్. బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సినిమా అందరికీ నచ్చుతుందని అన్నారు. థియేటర్ లో అందరు అలా అరుస్తుంటే నాకు కొత్తగా ఉందని అన్నారు విరాజ్ అశ్విన్. తాను ఇదివరకు నటించిన ఏ సినిమాలకు ఇలా జరగలేదు. ఆనంద్ నటన కు నాకు ఏడుపు వచ్చింది. వైష్ణవి అద్భుతంగా నటించింది ఇంత ప్రేమ చూపిస్తున్న ఆడియన్స్ కు థాంక్స్ అన్నారు విరాజ్.

సినిమా చూసేందుకు విజయ్ దేవరకొండ తో పాటు గా హీరోయిన్ రాశి ఖన్నా కూడా వచ్చారు. సినిమా చూసిన ఆమె తన స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయని అన్నారు. బేబీ సినిమా అద్భుతంగా ఉంది. ఆనంద్ వైష్ణవి విరాజ్ లు బాగా నటించారు. మామూలుగానే తనకు లవ్ స్టోరీ సినిమాలంటే ఇష్టమని.. సాయి రాజేష్ గారు అద్భుతంగా ఈ సినిమా తీశారని అన్నారు రాశి ఖన్నా. ఎస్.కె.ఎన్ గారు ఎప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తుంటారు. సినిమాకు మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ బాగా నచ్చాయి. ఇదో ఒక అందమైన ప్రేమ కథ చూసి అందరు ఎంజాయ్ చేయండి అని అన్నారు రాశి ఖన్నా.

Tags:    
  • VijayDevarakonda 
  • MovieNews 
  • Tollywood 
  • BabyMovie 
  • AnandDevarkonda 
  • VaishnaviChaitanya 
  • TupakiNews 

Similar News

దక్షిణ భారతదేశంలో జర్నలిజం ప్రమాణాలను పెంచుతున్న సిడ్పా (SIDPA)

2025-05-12 04:34 GMT

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్3లో జాయిన్ అవుతున్న విజయ్ దేవరకొండ

2024-07-03 04:20 GMT

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సరికొత్త సిరీస్ "మిస్ పర్ఫెక్ట్"

2024-02-03 04:35 GMT

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో "వధువు"

2023-12-10 04:55 GMT

లోకేష్ కనగరాజ్.. బడా దర్శకులలో టాప్ బ్రాండ్

2023-10-18 04:12 GMT

"అతిథి".. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ !!

2023-09-20 04:44 GMT

ఏడో సీజన్ తో "బిగ్ బాస్" వస్తున్నాడు !!

2023-09-03 04:03 GMT

"డిస్నీ ప్లస్ హాట్ స్టార్" స్పెషల్ "దయా" వెబ్ సిరీస్

2023-08-05 04:30 GMT

టిప్పు సుల్తాన్ జీవితం పై సినిమా.. నిర్మాత‌కు బెదిరింపులు!

2023-07-24 15:02 GMT

నేను చేసిన 15 సినిమాల్లో ఇదే నా బెస్ట్ మూవీ!

2023-07-24 11:21 GMT

మరోసారి బేబీ కాంబినేషన్ లో..

2023-07-16 05:13 GMT

సెన్సార్ సంకెళ్లు తెంచుకున్న 'భారతీయన్స్'.. ఇక డ్రాగన్ దుష్ట పన్నాగాలపై...

2023-07-15 06:20 GMT

Copyright @2026

Powered by Blink CMS