సైకిల్ హెవెన్ కు వెళ్తే.. అమ్మాయిలకు సైట్ కొట్టిన రోజులు గుర్తొస్తాయి
ఒకప్పుడు ఎన్ని మైళ్ల దూరమైన అలుపులేకుండా కాలినడకన వెళ్లే వాళ్లు. కొన్నేళ్ల తర్వాత ఎన్నో కిలోమీటర్లు సైకిల్‌పై సవారీ చేసేవారు. కానీ ఇప్పుడు.. పక్కనున్న షాప్‌కు వెళ్లాలన్నా బైక్ ఉండాల్సిందే. ఎడ్లబండ్లు, గుర్రపు టాంగాల తర్వాత రోడ్డుపై మొదటిసారి అడుగుపెట్టిన వాహనం అంటే సైకిలే.. అప్పట్లో కుర్రాళ్లు సైకిల్‌పై ఫీట్లు చేస్తూనే అమ్మాయిలను పడేసేవాళ్లు. సైకిల్ సవారీలే వాళ్లకి లాంగ్ డ్రైవ్‌లు. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు అప్పట్లో సైకిల్ అంటే అదో మోజు. అసలు ఇప్పుడు ఈ సైకిల్ గోల ఎంటనుకుంటున్నారా.. ఇవాళ ప్రపంచ సైకిల్ దినోత్సవం జరుపుకుంటున్నాం. అందుకే కాసేపు అలా మరోసారి సైకిల్ పై సవారీ చేసొద్దాం రండి..
ఒకప్పుడు మధ్యతరగతి వాళ్లకున్న లగ్జరీ సైకిల్. కానీ ఇప్పుడు రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాల్లో కూడా బైక్ రయ్‌రయ్ అంటోంది. అలా ఇంట్లోకి ఎప్పుడైతే బైక్ ఎంట్రీ ఇచ్చిందో.. వాకింగ్.. సైక్లింగ్...మూలన పడ్డాయి. కాస్తో కూస్తో శారీరక వ్యాయామం కూడా అటకెక్కింది.
ఫలితంగా ఊబకాయం, బీపీ, షుగర్ వంటి రకరకాల వ్యాధులు మన ఒంట్లో తిష్టవేస్తున్నాయి. చిన్నప్పుడు నాన్నతో సైకిల్ ముందు భాగంలో కూర్చొని ఆరోజు జరిగిన సంగతులన్ని చెబుతూ అలా వెళ్తుంటే ఎంత హాయిగా ఉండేదో. ఇంతకీ ఇప్పుడీ సైకిల్ గోలేంటి అనుకుంటున్నారా..? ఇవాళ ప్రపంచ సైకిల్ దినోత్సవమండీ. కాసేపు ఈ సైకిల్ మ్యాజిక్ గురించి తెలుసుకుందాం రండి..
సైకిల్‌పై సవారీ అంటే పాతతరానికి ఎంతో ప్రేమ. ఎన్ని కిలోమీటర్లయినా అలవోకగా తొక్కుతూ హాయిగా వెళ్లేవారు. అందుకేనేమో వారికి బీపీలు, షుగర్ వంటి రోగాలు దరిచేరలేదు. ఇప్పటికీ వారి ఆరోగ్యం చెక్కుచెదరకుండా ఉందంటే కారణం ఈ సైకిల్ సవారీయే. తాతల కాలం నుంచి ఇప్పటి వరకు సైకిల్‌కు అదే క్రేజు.. అదంటే అందరికీ అంతే మోజు. బైక్‌ల బాట పట్టిన యువత కూడా.. నెలకోసారి స్నేహితులతో కలిసి సైక్లింగ్‌కు వెళ్తున్నారంటే.. నేటి తరానికి సైకిల్‌తో ఉన్న అనుబంధమేంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎప్పటికప్పుడు సైకిల్ కూడా రూపురేఖలు మారుతోంది. కొత్తకొత్త డిజైన్లతో.. సరికొత్త ఫీచర్లతో మార్కెట్‌లోకి సైకిల్స్ వస్తున్నాయి. అయితే కొత్త సైకిళ్ల రాకతో.. పాత సైకిళ్లను మరిచిపోతున్నాం.
అలా పాత సైకిళ్లను మీరు మిస్ అవుతున్నారా..? పాతతరం సైకిళ్లను మీరు చూడాలనుకుంటున్నారా..? అయితే అమెరికా పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లోని సైకిల్ స్వర్గంకు వెళ్లాల్సిందే. సైకిల్ హెవెన్ అనే ఈ మ్యూజియంలో మన పూర్వీకులు ఉపయోగించిన సైకిల్ దగ్గర నుంచి ఈ తరం వాడుతున్న సైకిల్ వరకు అన్నీ చూసేయొచ్చు. మొట్టమొదటగా సైకిల్ ఎలా ఉండేది..? సైకిళ్ల పరిణామ క్రమం ఎలా ఉంది..? రూపు రేఖలు ఏ విధంగా మారాయి..? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సైకిల్ హెవెన్ వెళ్లాల్సిందే.
ఈ మ్యూజియం లోకి వెళ్తే ఎక్కడ చూసినా సైకిళ్లే కనిపిస్తాయి. గోడలు, పైకప్పులు అన్నీ సైకిళ్లే ఉంటాయి. మూడు వేలకు పైగా సైకిళ్లు ఇక్కడ మనం చూడొచ్చు. పాతకాలపు సైకిళ్లతో పాటు లేటెస్ట్‌గా తయారు చేసిన సైకిళ్లను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. క్రెయిగ్ మోరో అనే వ్యక్తి మూడు దశాబ్దాలుగా సైకిళ్లను సేకరిస్తూ ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ఈ సైకిల్ హెనెన్‌కు గ్లోబల్ వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడు పిట్స్‌బర్గ్‌కు వెళ్లినా.. సైకిల్ హెవెన్‌ను చూసి రావడం చాలా మందికి ఆనవాయితీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం మీరు అమెరికా వెళ్తే సైకిల్ హెవెన్‌కు వెళ్లడం మర్చిపోవద్దు..