ఎన్నో ఫిర్యాదులు.. మరెన్నో ఆటంకాల మధ్య వచ్చే నెల ఫస్ట్ నుంచి స్టూడెంట్లకు ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈనెల 27 నుంచే సార్లు స్కూళ్లకు రావాలని ఆదేశించింది. తొలి రోజు ప్రభుత్వ టీచర్లు పాఠశాలలకు హాజరై 5 నెలలుగా క్లాసుల్లో పేరుకుపోయిన దుమ్ము దులిపి రోజంతా ఖాళీగా కూర్చుకున్నారు. వారు పాఠాలు చెప్పడానికి విద్యార్థులు లేరు. ప్రభుత్వం ఆన్ లైన్ విద్యాబోధన అంటోంది. మరి ఈ ఆన్ క్లాస్‌లు ఎంతవరకు సక్సెస్ అవుతాయో..? ప్రభుత్వ టీచర్లకు ఆఫ్ లైన్ లో ఏం పని? అని చాలా మందిలో ప్రశ్న తలెత్తుతోంది. ఆన్‌లైన్ తరగతుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారని హైకోర్టు తాజాగా ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు సర్కార్ కూడా తనదైన రీతిలో సమాధానం ఇచ్చిందనుకోండి. కానీ.. లైవ్ క్లాస్‌లకు వెళ్లే సరికి ప్రభుత్వం చెబుతున్న మాటలు ఎలాంటి అవరోధాలు లేకుండా నడుస్తాయా అనేది ఇక్కడ పెద్ద డౌటు!!
రాష్ట్రంలో వన్ బై వన్ అన్‌లాక్ అమలవుతున్నా.. పెరుగుతున్న కరోనా కేసులతో ఎవరూ బస్సులు ఎక్కేందుకు సాహసించడం లేదు. ఈ క్రమంలో టీచర్లను స్కూళ్లకు రావాలని ప్రభుత్వం చెప్పింది. ఏ టీచర్ కూడా లోకల్‌గా ఉండి విద్యాబోధన చేసే పరిస్థితిలో లేరు. అలాంటప్పుడు వీరు డైలీ బస్సుల్లో అప్ అండ్ చేస్తూ చదువులు కొనసాగిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తోడు ఆర్టీసీ మెయిన్ రూట్లలోనే బస్సులు నడిపిస్తోంది. మారుమూల పల్లెలకు పంపడం లేదు. జీహెచ్‌ఎంసీలోనూ బస్సులు స్టార్ట్ కాలేదు. మరి ఇక్కడ ఉన్న స్కూళ్ల పరిస్థితి ఏంటి..? టీచర్లకు ఆయా స్కూళ్లకు ఎలా చేరుకుంటారు..? ఇంతవరకు దీనిపై ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం అయితే చూపించలేదు.
రాష్ట్రంలో సుమారు 40,597 స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 58 లక్షలకు పైగా స్టూడెంట్స్ చదువుతున్నారు. దీంట్లో ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలతో కలిపి 29,370 వరకు ఉన్నాయి. ఇందులో 29.09 లక్షల మంది చదువుతున్నారు. వీరందరికీ యాదగిరి, టీ శాట్, లోకల్ కేబుల్స్ ద్వారా పాఠాలు చెప్పాలని సర్కార్ నిర్ణయించింది.
ఇంతవరకు బాగానే ఉన్నా.. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల పరిస్థితిని సర్కార్ అంచనా వేయలేకపోయింది. భద్రాచలం, ఏటూరునాగారం, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్ పక్కా ట్రైబల్స్ జిల్లాలు. అక్కడ ఉన్న గిరిజనుల ఏ ఒక్క ఇంట్లో కూడా టీవీలు లేవు. మరి వారు చదువుకునేదెలా..? వారి పాఠాలు సాగేదెలా..? టీవీలు కొనే స్థోమత వారికి లేదు. అక్కడికి కేబుల్ కనెక్షన్ కూడా కష్టమే. ఏజెన్సీ గ్రామాల్లోనూ సుమారు వేల సంఖ్యలోనే విద్యార్థులు ఉన్నారు. వీరితోపాటు పలు పల్లెల్లోని కుటుంబాలకు టీవీలు లేవు. ప్రభుత్వం మరి వీరి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆన్‌లైన్‌లో క్లాస్‌లు వింటున్న టీచర్లు స్టూడెంట్ల ఇండ్లలోకి వెళ్లి పర్యవేక్షించాల్సి ఉంటుంది. అక్కడే వారికేమైనా డౌట్స్ ఉంటే సబ్జెక్ట్ టీచర్‌కి ఫోన్ చేసి క్లియర్ చేయాల్సి ఉంటుంది. అయితే.. ప్రస్తుతం కరోనా కాలం నడుస్తుండడంతో గ్రామాల్లో ప్రజలు వారిని ఇండ్లలోకి రానిస్తారా. అసలు స్టూడెంట్లకు ఆ పాఠాలు ఎంత వరకు అర్థం అవుతాయి. సార్లకు భయపడి అర్థమైనట్లుగా తలలూపుతారా..?
అసలే వర్షాకాలం.. ఆపై ఈదురుగాలులు. గ్రామాల్లో చిన్నగా చినుకులు స్టార్ట్ కాగానే కరెంట్ పోతుంటుంది. 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. విలేజ్‌లల్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. పాఠాలు వింటుంటే సడన్‌గా కరెంట్ పోతే ఆ రోజుకు ఆ స్టూడెంట్ పాఠాలు లాస్ అవుతాడు. మరి ప్రభుత్వం ఈ ఇబ్బందులను కూడా ఎలా అధిగమిస్తుందో.. ఈ ఆన్ లైన్ పాఠాలు ఎంత సక్సెస్ అవుతాయో చూడాలి మరీ..