హిల్లరీ క్లింటన్‌కు ఓటేస్తే 'బ్లోజాబ్‌'!

Update: 2016-10-21 13:31 GMT
"టీం ఇండియా ప్రపంచకప్ గెలిస్తే... నగ్నంగా పోజులిస్తా" అని ప్రకటించి బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనం పాండే. ఈ ప్రకటన అప్పట్లో సంచలనం సృష్టించింది. అనంతరం ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఈ విషయంపై చాలామంది అమ్మో... మరీ ఇంత బరితెగింపా, మరీ ఇంత దారుణమా అని ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. అయితే తాజాగా అమెరికా ఎన్నికల నేపథ్యంలో అత్యంత సంచలన ప్రకటన చేసింది పాప్ స్టార్ మడోన్నా. తాజాగా ఆమె చేసిన ప్రకటన అందరికీ షాక్ ఇచ్చింది.

ఆటపాటలతోనే కాకుండా సంచలన ప్రకటనలతో కూడా ఫుల్ ఫేమస్ అయిన పాప్ స్టార్ మడోన్నా... తాజా అమెరికా అధ్యక్ష అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ పై తనకున్న అభిమానాన్ని చూపించుకోవడానికి సంచలన మార్గం ఎంచుకుంది. హిల్లరీ క్లింటన్‌ కు ఓటేస్తే "బ్లోజాబ్‌" (ఓరల్ సెక్స్)కు సిద్ధమని ప్రకటించింది. అవును "హిల్లరీ క్లింటన్‌ కు ఓటేస్తే, నేను మీతో బ్లౌ జాబ్‌కు రెడీ" అని అనేసింది.

అయితే చాలా మంది ఆమె ప్రకటన విని ఓఎంజీ (ఓ మై గాడ్) అని నోరెళ్లబెట్టగా, మరికొందరూ జోక్‌ గా కొట్టిపారేశారు. దీంతో తన ప్రకటనను జోక్‌ గా తీసుకుంటున్న వారిని ఉద్దేశించి మరోసారి గట్టిగా స్పష్టంగా తేల్చి చెప్పేసింది ఈ 58 ఏళ్ల పాప్ సింగర్. "దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను.. మాట తప్పను.. బ్లోజాబ్ (ఓరల్ సెక్స్) చేసి తీరతాను" అని పేర్కొంది. కాగా, 80లలో పాప్‌ లో శృంగారాన్ని పరిచయం చేసి సంచలనం సృష్టించిన మడొన్నా ఇప్పుడు మళ్లీ తన "హాట్ హాట్" ఆఫర్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కాగా నవంబరు 8న ఈ ఎన్నికలు జరగనున్నాయి.

Full View
Tags:    

Similar News