ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కుకుట్ పల్లి కోర్టుకు హాజరు కావటం ఆసక్తికరంగా మారింది. వివాదాలకు దూరంగా.. మిస్టర్ కూల్ గా కనిపించే ఆయన కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చిందన్న విషయంలోకి వెళితే.. సైబర్ క్రైం కేసులో సాక్ష్యం చెప్పేందుకేనని చెబుతున్నారు.
వీవీఎస్ లక్ష్మణ్ కు సనత్ నగర్ లోని డీసీబీ బ్యాంకులో ఖాతా ఉంది. 2014లో ఆయన ఖాతాను ఓ వ్యక్తి హ్యాక్ చేశారు. రూ.10 లక్షలు డ్రా చేశాడు. దీనికి సంబంధించిన వివరాలు లక్ష్మణ్ కు ఈ మొయిల్ లో సమాచారం వచ్చింది. వెంటనే.. బ్యాంక్ మేనేజర్ ను సంప్రదించిన లక్ష్మణ్.. తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసినట్లుగా ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన సదరు బ్యాంక్ మేనేజర్.. ఈ నేరంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచన చేశారు. దీంతో.. 2015లో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదును రికవరీ చేశారు. దీనిపై అప్పట్లో సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాల్ని కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు లక్ష్మణ్ కోర్టుకు హాజరయ్యారు.