స్కూలు పక్కనే వ్యభిచారం.. గుట్టు రట్టైంది ఇలా..!

Update: 2020-09-27 17:30 GMT
విశాఖ గాజువాకలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. పక్కా సమాచారంతో పోలీసులు ఈ వ్యభిచార గృహంపై దాడులు చేశారు. పలువురు యువతులను, విటులు, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

విశాఖలో ముగ్గురు వ్యక్తులు,  ఓ మహిళ కలిసి ముఠాగా ఏర్పడి వ్యభిచార దందా మొదలు పెట్టారు. విశాఖ శివారు ప్రాంతంలోని గాజువాక అందుకు అనువైన ప్రాంతంగా ఎంచుకున్నారు.

గాజువాకలోని ఎస్ ఎఫ్ ఎస్ పాఠశాలకు దగ్గర్లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. విజయవాడ - గుంటూరు - హైదరాబాద్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ గుట్టుగా వ్యభిచారం చేయిస్తున్నారు.

శనివారం సాయంత్రం పోలీసులు ఒక్కసారిగా దాడి చేయడంతో ఈ చీకటి వ్యాపారం వెలుగు చూసింది. ఈ సందర్భంగా ముగ్గురు యువతులు, ఒక విటుడు, ఇద్దరు మధ్యవర్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News