ఉపేంద్ర సంచలన నిర్ణయం ... త్వరలో నే 17 మందితో లిస్ట్ ..!

Update: 2019-11-14 07:17 GMT
కన్నడ సూపర్ స్టార్ గా ఎదిగిన ఒక సామాన్యుడు. తెలుగు లోనూ ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకున్న సెన్సేషనల్ హీరో. డైరెక్షన్ అయిన , యాక్టింగ్ అయిన , ప్రొడ్యూసర్ గా అయిన  ఏది చేసినా కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. తెర పై కొంచెం తిక్క తిక్కగా కనిపించినా ..నిజ జీవితం లో మాత్రం డౌన్ టు ఎర్త్ ఉండే రియల్ స్టార్ . అయన మరెవరో కాదు .. ఉపేంద్ర.  ఉపేంద్ర దర్శకుడిగా తన సినీ జీవితం ప్రారంభించినప్పటికీ నటుడి గా, కథా రచయిత గా, పాటల రచయితగా, సంగీత దర్శకుడి గా మరియు నేపథ్య గాయకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు.

ఇక ఉపేంద్ర ప్రస్తుతం ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరో వైపు రాజకీయాల లో కొనసాగుతున్నారు. గత ఏడాది కర్ణాటక రాజకీయాల లో జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యం లో సెప్టెంబర్ 18, 2018న ఉత్తమ ప్రజాకీయ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  ఇక పోతే ప్రస్తుతం కర్ణాటక లో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది. కాంగ్రెస్ , జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలి పోవడానికి కారణమైన 17 మంది ఎమ్మెల్యే ల విషయం లో తాజాగా సుప్రీం సంచలన తీర్పుని వెల్లడించిన విషయం తెలిసిందే.  
Read more!

దీనితో మరికొద్ది రోజుల్లో ఆ 17 స్థానాలలో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఉప ఎన్నికల నేపథ్యం లో తాజాగా ఉపేంద్ర ట్విట్టర్‌ లో ఒక కీలక ప్రకటన చేశారు. రాబోయే ఉప ఎన్నికల లో తమ పార్టీ తరపున పోటీ చేయ బోయే అభ్యర్థుల లిస్ట్‌ను త్వరలో నే ప్రకటిస్తానని ఆయన తెలిపారు. అలాగే నాయకుడి నుండి అధికారాన్ని ప్రజలకు ఎలా బదిలీ చేయాలనే దానికోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. దీనితో ఉత్తమ ప్రజాకీయ పార్టీ నేతలు , ఉపేంద్ర అభిమానులు ఉప ఎన్నికల లో పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్ట్ కోసం ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.
Tags:    

Similar News