రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది ఫిబ్రవరి 26 నుంచి భీకర పోరు జరుపుతోంది. కానీ రష్యా ఏం సాధించింది? ఉక్రెయిన్ ను ఎంత భయపెట్టినా అది ఏ మాత్రం తగ్గేదేలే అంటోంది. దీంతో పుతిన్ సహనం నశించి నిరాశా నిస్ర్పహలకు లోనవుతున్నట్లు తెలుస్తోంది కానీ యుద్ధం మాత్రం ఆపేది లేదని పుతిన్ సైతం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఏం జరగబోతోందనే విషయంలో నిరంతరం అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు
రష్యా సేనల పోరులో అమాయక ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మొదట జనావాసాలపై యద్ధం చేయమని చెప్పిన పుతిన్ సేనలు తరువాత మనసు మార్చుకుని ప్రజలపై కూడా దాడులకు తెగబడుతున్నారు. ఫలితంగానే లక్షలాది మంది జనాలు అసువులు బాస్తున్నారు. రక్తపుటేరులు పారుతున్నాయి. వీటన్నింటికి పుతిన్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడాల్సి ఉంటుంది. దీనికి గాను అమెరికా ఇప్పటికే హెచ్చరికలు చేసినా బేఖాతరు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మాస్కో అధునాతన యంత్రాలతో దూసుకుపోతోంది. ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తోంది. ఇందుకు గాను యుద్ధ తంత్రాన్ని మారుస్తోంది. ఉక్రెయిన్ ను కబలించి తీరుతామని పుతిన్ చెబుతున్నారు. జెలెన్ స్కీ మాత్రం తగ్గడం లేదు. రష్యాను అడ్డుకుని తీరుతామని ధీమాగా ప్రకటిస్తున్నారు. దీంతో రష్యా సేనలు మరింత రెచ్చిపోతున్నాయి. ఉక్రెయిన్ ను హస్తగతం చేసుకునే క్రమంలో ఎంతకైనా తెగించేందుకు సిద్ధమవుతున్నాయి.
అయితే అమెరికా, యూరప్ దేశాల సహాయంతో ఉక్రెయిన్ భారీగా ఆయుధాలు సముపార్జించుకొని రష్యాను చావుదెబ్బ తీస్తోంది. ముఖ్యంగా రష్యా వాయుసేనను ఉక్రెయిన్ కు చెందిన ఓ పైలెట్ చావుదెబ్బతీశాడని.. అతడిని 'ఘోస్ట్ ఆఫ్ కీవ్'గా పత్రికలు హోరెత్తించాయి.
అతడు 40 రష్యా యుద్ధ విమానాలను కూల్చేసిన అతడు కొద్దిరోజుల క్రితం మీతిచెందాడని.. ఇతడిని ఉక్రెయిన్ ప్రజలు ఘోస్ట్ ఆఫ్ కీవ్ అని కీర్తిస్తున్నట్టు వార్తా పత్రికల్లో కథనాల ప్రచురితమయ్యాయి. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. 40 రష్యన్ యుద్ధ విమానాలు కూల్చిన వ్యక్తిని ఉక్రెయిన్ ప్రజలు కీర్తించారు.
తాజాగా ఉక్రెయిన్ సైన్యం కీలక ప్రకటన చేసింది. 'ఘోస్ట్ ఆఫ్ కీవ్' పాత్ర కేవలం కల్పితం అని.. ఉక్రెయిన్ వైమానిక దళ కమాండ్ తన ఫేస్ బుక్ ద్వారా తెలియజేసింది. ఘోస్ట్ ఆఫ్ కీవ్ పాత్ర ఉక్రెయిన్ ప్రజలు సృష్టించిన పేరేనని ఆయన తెలిపారు. దీంతో పదిరోజులుగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న ఘోస్ట్ ఆఫ్ కీవ్ కు తెరపడినట్లైంది.