తను మళ్లీ టీవీ నైన్ సీఈవోగా వస్తున్నానంటూ ఆ సంస్థ మాజీ సీఈవో రవి ప్రకాష్ ఇంకా హడావుడి కొనసాగిస్తూ ఉండటం గమనార్హం. సోషల్ మీడియాలో ఆ మేరకు ప్రచారాన్ని చేపడుతూ ఉన్నాడట రవి ప్రకాష్. ఎలాంటి పరిస్థితుల్లో అతడు టీవీ నైన్ సీఈవో హోదా నుంచి వైదొలిగిందీ అందరికీ తెలిసిన సంగతే.
అక్కడ అవకతవకలకు పాల్పడిన ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. అందులో భాగంగా జైలుకు వెళ్లాడు. ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది.ఇప్పటి వరకూ రవి ప్రకాష్ ను అరెస్టు చేసింది ఒక్క కేసులో మాత్రమే. మిగిలిన కేసుల్లో ఆయనను మళ్లీ అరెస్టు చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.
అయితే రవి ప్రకాష్ మాత్రం ఇంకా పాత కలల్లోనే ఉన్నాడని తెలుస్తోంది. తను మళ్లీ టీవీ నైన్ సీఈవోగా రాబోతున్నట్టుగా ఆయన ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా కొనసాగిస్తున్నట్టుగా సమాచారం.
ఇదంతా చూస్తుంటే..రవి ప్రకాష్ ఇంకా కలల్లోనే ఉన్నాడని - టీవీ నైన్ యాజమాన్యం మారినా - రవి ప్రకాష్ ను కొత్త యాజమాన్యం పూర్తిగా పక్కన పెట్టినా.. పక్కన పెట్టడమే గాక చీటింగ్ కేసులు పెట్టినా..
రవి ప్రకాష్ మాత్రం ఇంకా తను టీవీ నైన్ కు సీఈవోగా రాబోతున్నట్టుగా ప్రచారం చేసుకోవడం - టీవీ నైన్ తనదే అన్నట్టుగా వ్యవహరించడం.. ఇదంతా ఎవరిని మోసం చేయడానికి? అంటూ కొందరు జర్నలిస్టులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే చీటింగ్ కేసులను ఎదుర్కొంటున్న రవి ప్రకాష్ కు మళ్లీ అలాంటి మోసాలకు పాల్పడటం సులువేమో అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.