అచ్చంపేటలో కేసీఆర్ ప్రభంజనం
మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీని టీఆర్ ఎస్ కైవసం చేసుకుంది. ప్రత్యర్థులకు దిమ్మతిరిగే రీతిలో షాక్ ఇచ్చిన టీఆర్ ఎస్ నగర పంచాయతీలోని మొత్తం 20 వార్డులు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. వార్‌ను వన్ సైడ్ చేసేసింది. ఇక్కడ అధికార పార్టీని ఢీకొట్టే శక్తి లేక ప్రతిపక్షపార్టీలన్నీ కలిసి ఐక్యకూటమిగా ఏర్పడ్డాయి.
అయినా టీఆర్ ఎస్ ను ఎదుర్కొని కనీసం ఒక వార్డు కూడా గెలుచుకోలేకపోయాయి. ఇక్కడ నుంచి టీఆర్ ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గువ్వల బాలరాజు టీఆర్ ఎస్ ను గెలిపించేందుకు ముందునుంచి పక్కా ప్లానింగ్ తో వ్యవహరించారు. ఇక ఈ ఎన్నికలను జిల్లా కాంగ్రెస్ నాయకులతో పాటు స్థానిక నాయకత్వం కూడా సీరియస్‌గా తీసుకోలేదు. ఓటమిని ముందుగానే గ్రహించి ఇతర పార్టీలతో కలిసి ఐక్యకూటమిగా ఏర్పడినా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు.