“ఉత్తమ స్టార్టప్ అవార్డు గెలిచిన “తెలుగు యాప్”

Update: 2017-02-27 14:00 GMT
Manam Team వారి “మనం యాప్” - తెలుగువారి తొలి సోషల్ నెట్వర్కింగ్ యాప్, అనేకమంది తెలుగు ప్రజల సామాజిక జీవనంలో అంతర్భాగంగా మారింది. మీరు తెలుగువారు అయితే, ఇప్పటికే ఈ యాప్ ని ఉపయోగించే వారు మీకు తెలిసివుండొచ్చు. తెలియకపోయినా పర్లేదు, మీరు “మనం యాప్” తో కొత్త తెలుగు స్నేహితులను కలుసుకోవచ్చు, మాట్లాడవచ్చు, మరియు ఒకరి భావాలు మరొకరు పంచుకోవచ్చు. 108 దేశాలలో నివసిస్తున్న తెలుగువారు ఈ యాప్ ను ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు.

ఫిబ్రవరి 18 & 19, 2017 న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరిగిన StartAP పోటీలో దేశం నలుమూలల నుండి 50 కు  పైగా స్టార్టుప్ లు పోటీ పాడగా, “మనం యాప్” కు ఉత్తమ స్టార్టప్ పిచ్ అవార్డు లభించింది. ఈ వార్షిక పోటీలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరియు StartAP కంపెనీ వారు విర్వహించారు.

అవార్డు ఉత్సవం లో రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి శ్రీ పల్లె రఘునాథ రెడ్డి గారు మరియు StartAP సిఇఓ శ్రీ సిద్ధార్థ్ మారుపెద్ది గారు ఉత్తమ స్టార్టప్ పిచ్ అవార్డు తో పాటు "మనం యాప్" కు లక్ష రూపాయల బహుమతిని అందించారు.

ఈ స్టార్ట్ ఏపీ కార్యక్రమంలో ఇతర కేబినెట్ మంత్రులు, దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సీనియర్ ప్రభుత్వ, విద్యారంగ అధికారులు మరియు పరిశ్రమ సలహాదారులు హాజరయ్యారు.

ఈ ఉచిత యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ (Download) చేయండి, కొత్త తెలుగు స్నేహితులను కలవండి.

ఆపిల్ యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆండ్రాయిడ్ యాప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్నివివరాలకు www.manamapp.com లేదా namaste@manamapp.com ద్వారా తమను సంప్రదించవచ్చునని మనం యాప్ సంస్థ స్థాపకులు గిరీష్ కొల్లూరి, బసంత్ వలేటి, హర్షా కాజా లు తెలిపారు.

Manam గురించి:
న్యూ యార్క్ లో ప్రారంభం అయిన "మనం కంపెనీ" తెలుగు మరియు భారతీయుల రోజువారీ జీవనం సరదాగా, వినోదభరితంగా చేసేఅందుకు 3 ఉత్తేజకరమైన మొబైల్ అప్లికేషన్స్ విడుదల చేసింది.

1. Manam App - 100% తెలుగువారి సోషల్ నెట్వర్కింగ్ యాప్

2. Kulfy App - WhatsApp లో ప్రత్యేకంగా భారతీయ GIF లు షేర్ చేసుకోడానికి ఈ యాప్

3. Desi Talkies App - USA లో భారత సినిమా ప్రదర్శన సమయాలు కోసం.

 

Press release by: Indian Clicks, LLC
Tags:    

Similar News