తీర్పు..గీర్పు లేదంటూ డ్రాగన్ ఏం చేస్తుందంటే..

Update: 2016-07-13 16:26 GMT
దురాశకు బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించే డ్రాగన్ దేశం తానెంత దుర్మార్గురాలన్న విషయాన్ని ప్రపంచానికి చాటేలా వ్యవహరిస్తోంది.అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తోసి రాజని అనటమే కాదు.. తనకు హక్కులు లేవని తేల్చిన తర్వాత కూడా మొండితనంతో తెగబడుతున్న తీరు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై తనకు హక్కులు లేవని చెప్పిన హేగ్ ట్రిబ్యునల్ తీర్పును తాము ఆమోదించమని తేల్చేసిన చైనా తాజాగా మరో బరి తెగింపునకు పాల్పడింది.

దక్షిణ చైనా సముద్రం విషయంలో తమ భద్రతకు భంగం వాటిల్లేలా చేస్తే..సముద్ర గగనతలాన్ని రక్షణ జోన్ గా ప్రకటిస్తామని చెబుతోంది. దక్షిణ చైనాసముద్రాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకునేలా చైనా మాటలు ఉండటం గమనార్హం. సముద్ర జలాల్లో తమకు హక్కులు ఉన్నాయని.. కానీ వాటిని పాటించని చైనా వైఖరిపై వియత్నాం.. బ్రూనై.. మలేషియా.. ఫిలిప్పీన్ లుచేస్తున్న ఆందోళనల్ని చైనా లైట్ తీసుకుంటోంది. హేగ్ ట్రిబ్యునల్ తీర్పు తమతీరును ఏ మాత్రం ప్రభావితం చేయదన్నట్లుగా వ్యవహరిస్తున్న చైనా విషయంలో అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News