స్నాప్ డీల్ పెదవి విప్పి ఏం చెప్పిందంటే..?

Update: 2015-11-25 13:21 GMT
దేశంలో పెరిగిపోతున్న అసహనం కారణంగా.. నా భార్య నాతో మాట్లాడుతూ దేశం విడిచి వెళ్లిపోదామా అని అడిగిందంటూ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ వ్యాఖ్యలు చేయటం.. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావటం.. అన్నింటికి మించి సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. అమీర్ మీదున్న అగ్రహంతో అతగాడు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న స్నాప్ డీల్ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేయటం.. తక్కువ రేటింగ్ ఇవ్వటం.. లాంటివి చేస్తున్నారు. ఒక విధంగా అమీర్ వ్యవహారం స్నాప్ డీల్ మెడకు చుట్టుకుంది.

రెండు రోజులుగా సాగుతున్న ఈ వివాదానికి సంబంధించి.. భారీగా వస్తున్న ప్రతికూల కామెంట్లు.. రేటింగ్ ల నడుమ స్నాప్ డీల్ తాజాగా రియాక్ట్ అయ్యింది. అమీర్ వివాదం షురూ అయినప్పటి నుంచి మౌనంగా ఉన్న స్నాప్ డీల్ పెదవి విప్పక తప్పలేదు. అమీర్ ఖాన్ వ్యక్తిగత పరిధిలో చేసిన వ్యాఖ్యలతో స్నాప్ డీల్ కు ఎలాంటి పాత్ర కానీ.. సంబంధం కానీ లేదని పేర్కొంది. భారత్ కు గర్వకారణమైన సంస్థగా తమను తాము అభివర్ణించుకున్న స్నాప్ డీల్.. యువ భారతీయులు అత్యంత ప్రేమతో నిర్మించిన సంస్థగా పేర్కొంది.
Tags:    

Similar News