ధవన్ సరదా.. మరొకరికి శాపంగా మారింది.

Update: 2021-01-25 06:40 GMT
ఒకరి సరదా.. మరొకరికి శాపంగా అస్సలు మారకూడదు. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది. టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధవన్ తాజాగా చేసిన పని ఇప్పుడు దాంతో సంబంధం లేని వ్యక్తిపై కేసు పెట్టే వరకు వెళ్లింది. సంచలనంగా మారిన ఈ ఉదంతం ఎక్కడి వరకు వెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అసలేం జరిగిందంటే..

తాజాగా వారణాసికి బోటింగ్ కు వెళ్లిన ధవన్.. పక్షులకు మేత వేశారు. ఈ సందర్భంగా ఫోటో దిగారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆయన చేసిన తప్పులు ఇప్పుడు పలువురి మెడకు చుట్టుకునే పరిస్థితి. బోటులో ప్రయాణించే సమయంలో పక్షులకు మేత వేయటాన్ని నిషేధించారు. ఈ అంశం మీద అవగాహన ఉందో లేదో తెలియని శిఖర్.. పక్షులకు మేత వేయటాన్ని పేర్కొంటూ.. పక్షులకు మేత వేయటం ఆనందంగా ఉందన్న క్యాప్షన్ తగిలించాడు.

ఈ పోస్టు వైరల్ గా మారింది. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో పక్షులకు ఆహారాన్ని అందించటం తనకు సంతోషంగా ఉన్నట్లుగా పేర్కొనటం.. దీనిపై స్పందించిన అధికారులు పక్షులకు మేత వేసేందుకు అనుమతించిన బోట్ మెన్ మీద కఠిన చర్యలు తీసుకుంటామని వారణాసి కలెక్టర్ కౌశల్ రాజ్ శర్మ హెచ్చరించారు. అంతేకాదు.. చర్యలు పర్యాటకుల మీద ఉండవని.. బోటు యజమానుల మీద ఉంటాయని చెబుతున్నారు.

దీంతో శిఖర్ ధవన్ కు ఈ ఎపిసోడ్ నుంచి చర్యల తిప్పలు తప్పినట్లేనని చెబుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు స్థానిక అధికారులకు.. బోటు యజమానులకు తెలుస్తుందని.. పక్షులకు మేత వేయటాన్ని నిరోధించటంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీంతో.. ధవన్ చేసిన పనికి స్థానిక బోటు యజమానులు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. మొత్తానికి తప్పు చేసినోడ్ని వదిలేసి.. దాన్ని చూస్తున్న వారికి మాత్రం కేసు నమోదు చేయటం ఇప్పుడు కొత్త టెన్షన్ గా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News