హైకోర్టు జడ్జీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన సోషల్ మీడియా నెటిజన్ లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఇప్పట్లో జైలు నుంచి బయటపడే సూచనలు కనిపించడం లేదు. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. ప్రతివాయిదాకు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అయితే బెయిల్ పై విడుదలైన లింగారెడ్డి తొలి వాయిదాకే గైర్హాజరయ్యాడు. దీంతో జడ్జి ఆగ్రహించడంతో కోర్టులో లొంగిపోయిన లింగారెడ్డికి ఆగస్టు 5 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
న్యాయవాదులు, తీర్పుల పై సోషల్ మీడియాలో అభ్యంతరక పోస్టులు పెట్టిన తీరుపై న్యాయస్థానం సీరియస్ అయ్యింది. ఈ కేసులో ఇప్పటివరకు 12మందిపై కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు కడప జిల్లాకు చెందిన రాజశేఖర్ రెడ్డి. ఇతడిని ఈనెల 10న సీబీఐ పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా కోర్టులో హాజరు పరిచారు. దీంతో అతడికి రిమాండ్ విధించారు. మూడు రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించారు. అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.
అయితే తొలి వాయిదాకే లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి డుమ్మా కొట్టాడు. లింగారెడ్డి గౌర్హాజరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి వెంటనే అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఇంత నిర్లక్ష్యమా అని జడ్జి ప్రశ్నించారు. వారెంట్ జారీ అవ్వడంతో లింగారెడ్డి కోర్టులో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు.కోర్టు ఆదేశాలు పాటించలేదని ప్రశ్నించిన న్యాయమూర్తి లింగారెడ్డికి ఆగస్టు 5 వరకు రిమాండ్ విధించింది.