ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటివి తెలుగు రాజకీయాల్లో కొత్త కాకున్నా.. ఇటీవల కాలంలో మాత్రం మరింతగా పెరిగిపోయాయి. తాము అధికారపక్షంలో లేకుంటే ఊపిరి ఆడనట్లుగా ఫీలయ్యే నేతలు పెరిగారు. దీంతో.. పవర్ లో ఉన్నప్పుడు ఒకలా.. పవర్ చేజారిన వెంటనే మరోలా వ్యవహరించే తీరు అంతకంతకూ పెరుగుతోంది. ఆ మధ్య జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బాబుకు భారీగా పంచ్ లు ఇస్తూ.. తెలుగు తమ్ముళ్లు పలువురు పార్టీని వదిలేసి వెళ్లిన వైనం తెలిసిందే.
లాక్ డౌన్ వేళలోనూ ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేతో పాటు.. మరో మాజీ మంత్రి ఇద్దరూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ గూటికి చేరుకునేందుకు రెఢీ అవుతున్న వార్తలు టీడీపీలో కలకలం రేపుతోంది. సైకిల్ మీద ప్రయాణం కష్టంగా మారిందని.. ఎంచక్కా ఫ్యాన్ కింద కూర్చొని చల్లటి గాలికి సేద తీరాలని భావించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు పార్టీలో చేర్చటం తెలిసిందే. ఎమ్మెల్సీ పోతుల సునీత..చీరాల ఎమ్మెల్యే కమ్ టీడీపీకి వీర విధేయుడిగా చెప్పే కరణం బలరాంతోపాటు.. తన కుమారుడ్ని అధికార పార్టీలో చేర్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా పార్టీకి చెందిన ఇద్దరు నేతలు సైకిల్ నుంచి దిగేందుకు రంగం సిద్ధం చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే పలువురు నేతలు బాబును విడిచి వెళ్లిపోతున్న వేళ.. మరో రెండు కీలకమైన వికెట్లు పడిపోవటం ఖాయమని.. పార్టీ మారిపోయేందుకు వీలుగా ఇప్పటికే ప్రయత్నాలు పూర్తి చేసుకున్నట్లుగా చెబుతున్నారు. లాక్ డౌన్ వేళ.. హైదరాబాద్ కే పరిమితమైన చంద్రబాబు.. తమ్ముళ్లు హ్యాండ్ ఇస్తే మరిన్ని తిప్పలు తప్పవంటున్నారు.