పవన్, చిరులను కలిపేది వారేనా?

Update: 2017-03-19 08:11 GMT
ఒకరిదేమో ప్రజారాజ్యం... దాన్ని గంగలో కలిపేసి తాను కాంగ్రెస్ లో కలిసిపోయారు ఆ పార్టీ అధినేత. ఇంకొకరిదేమో జనసేన.. ఇప్పుడిప్పుడే దాన్ని జనంలోకి తీసుకెల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరూ అన్నదమ్ములు. అన్న రాజకీయాల నుంచి మళ్లీ సినిమాల్లోకి వస్తుంటే.. తమ్ముడు సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్తున్నాడు. ఇద్దరి రూట్లు వేర్వేరు. కానీ.. ఇద్దరూ కలిస్తే.. సాధ్యమో? అసాధ్యమో? కలిస్తే మాత్రం పొలిటికల్ గా సూపర్ హిట్టే అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు.. ఆ ఇద్దరినీ కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఎన్నికల నాటికి ఈ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందని చెబుతున్నారు.
    
చిరంజీవిని, వపన్ ను కలిపేందుకు కొందరు గట్టిగా ప్రయత్నిస్తున్నారట. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రముఖులు ఇద్దరు అదే పనిలో ఉన్నారట. కాటమరాయుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ సాక్షిగా వారెవరో అర్థం చేసుకున్నారు జనం. టీవీ9 రవిప్రకాష్ కాటమరాయుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో కనిపించేసరికి చాలామంది ఆశ్చర్యపోయారు. తర్వాత అర్థం చేసుకున్నారు. ఈయనకు తోడుగా ఎన్టీవీ చౌదరి కూడా వచ్చారు. పవన్, రవిప్రకాష్ పక్కపక్కనే కూర్చున్నారు.
    
కాగా పవన్ మైక్ అందుకున్న వెంటనే అతడి నోటి నుంచి మొట్టమొదట వచ్చింది రవిప్రకాష్ - చౌదరి పేర్లే . రవి ప్రకాశ్ టీవీ9 నుంచి బయటకు వస్తారని.. ఎన్టీవీ నరేంద్ర నాథ్ చౌదరితో కలిసి కొత్త చానల్ పెడతారని ప్రచారం జరుగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News