రాష్ర్టపతిగా రజనీకాంత్..మోడీ షాకింగ్ డెసిషన్?

Update: 2017-04-22 10:17 GMT
సౌతిండియాలో ఎలాగైనా పాగా వేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న కర్ణాటకలో బలంగానే ఉన్నప్పటికీ తమిళనాడులో మాత్రం ఏమాత్ర పట్టు పెంచుకోలేకపోతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ పప్పులు ఉడకడం లేదు. దీంతో తమిళనాడు - కర్ణాటకలు రెండిటినీ ఒకే దెబ్బకు కొట్టాలన్న ఉద్దేశంతో భారీ స్టెప్ వేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ను రాష్ర్టపతి చేయాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
    
రజనీ అంటే తమిళులకు ఆరాధ్యదైవం. పైగా వివాద రహితుడు. అన్ని పార్టీలతోనూ ఒకేలాంటి సంబంధాలున్న వ్యక్తి. పేరుకు తమిళ నటుడే అయినా దేశమంతటికీ... ఇంకా చెప్పాలంటే ఇతర దేశాల్లోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. ఆయన్ను ఎంచుకుంటే ఎవరి నుంచీ అభ్యంతరం ఉండదని భావిస్తున్నారు.
    
అంతేకాదు.. తరచూ హిమాలయాలకు  వెళ్లి వచ్చే రజనీ ఆధ్యాత్మిక భావనలున్న వ్యక్తి. ఇది, బీజేపీ, ఆరెస్సెస్ ల్లో ఆయన పట్ల ఆమోదం తెస్తుంది. మరోవైపు తమిళనాడు అంటే సినీ నటులు రాజకీయాలను ఏలిన నేల. ఇప్పడు జయలలిత మరణం తరువాత అక్కడ నాయకత్వ లేమి ఏర్పడింది. దీంతో రజనీని రాష్ర్టపతి చేసి తమిళుల మనసు కొల్లగొట్టలని బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడులో ఈ మేరకు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News