జేసీ నోట బాంబులంటే ఏంటో తెలుసా?

Update: 2017-03-23 04:39 GMT
జేసీ దివాకర్ రెడ్డి అన్న పేరు వినిపించిన వెంటనే.. గుర్తుకు వచ్చేవి రెండే రెండు అంశాలు. ఒకటి వివాదాస్పదంగా ఆయన నోటి నుంచే వ్యాఖ్యలు..రెండోది ఆయన చేసే వ్యాపారాలు. కాంట్రాక్టులతో సహా పలు వ్యాపారాలు చేసే జేసీ లాంటోడికి డబ్బుల ఇబ్బంది ఉంటుదంటే నమ్మగలమా? కానీ.. తానిప్పుడు మైనస్ లో ఉన్నట్లు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్న వేళ..ఏపీ అసెంబ్లీ వద్దకు వచ్చిన ఆయన.. అసెంబ్లీ కారిడార్లో  మీడియా మిత్రులతో సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడకు మంత్రులు గంటా శ్రీనివాసరావు.. పత్తిపాటి పుల్లారావులు వచ్చారు. దీంతో.. సంభాషణ కడప జిల్లా పులివెందులలో మంత్రి గంటాను రంగంలోకి దించేందుకు మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రయత్నిస్తున్నారంటూ ఒక విలేకరి సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన జేసీ నవ్వేస్తూ.. గంటా పులివెందులకు సరిపోరని.. ఆయన బరిలో దిగే ప్లస్ లు వేరే ఉన్నాయన్నారు.

అయినా.. వాళ్లు..వీళ్లు ఎందుకు.. మీరున్నారుగా? అంటూ మరో విలేకరి వ్యాఖ్యానించగా స్పందించిన జేసీ.. ‘‘ఇప్పుడు బాంబుల స్టాక్ లేదులే..వద్దులే’’ అన్నారు. బాంబులు అంటే మరేమో అనుకునేరు.. దుడ్లు (డబ్బులు) లేవు..ప్రస్తుతం మైనస్ లలో ఉన్నామంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. పులివెందులలో పోటీ అంటే డబ్బులు దండిగా ఉండాలంటూ వ్యాఖ్యానించారు.  జేసీ లాంటి వ్యాపారవేత్త దగ్గర డబ్బులు లేకపోవటమా? అందులోనూ అదికారపక్ష నేతకు డబ్బు కొరతేంది?అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News