చంద్రబాబును కలిసిన జగన్ బ్యాచ్ ఎమ్మెల్యే

Update: 2016-02-14 04:18 GMT
తెలంగాణ అధికారపక్షం ఇస్తున్న షాకులపై తెగ విరుచుకుపడుతున్న తెలుగుదేశం పార్టీ.. ఏపీలో అదే రీతిలో వ్యవహరించటం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు విలవిలలాడిపోతున్న బాబు అండ్ కో.. ఏపీలో తన రాజకీయ ప్రత్యర్థి జగన్ కు షాకులిస్తోంది. జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ (విజయవాడ తూర్పు) తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు.

జలీల్ ఖాన్ సైకిల్ ఎక్కుతారన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతున్నా.. ఎప్పటికప్పుడు ఈ ఇష్యూ వాయిదా పడుతూ వస్తోంది. ఈ మధ్యనే బాబును జలీల్ ఖాన్ ను కలవటం కలకలం రేపితే.. తాజాగా మరోసారి ఏపీ ముఖ్యమంత్రితో భేటీ కావటం ఆసక్తికరంగా మారింది. తాను నియోజకవర్గ సమస్యల్ని చర్చించేందుకు వచ్చినట్లుగా జలీల్ ఖాన్ చెప్పినప్పటికీ.. మిగిలిన ఎమ్మెల్యేలకు ఇవ్వని ఛాన్స్ జలీల్ ఖాన్ కే బాబు ఎందుకు ఇస్తున్నారన్న ప్రశ్న వేసుకుంటే అసలు విషయం అర్థమవుతుంది. జలీల్ ఖాన్ సైకిల్ ఎక్కటం దాదాపుగా ఖరారైందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News