సీఎం జగన్ సంచలన నిర్ణయం ...ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ ఆరు ప్రమాణాలు పాటించాల్సిందే !
కరోనా సమయం లో ప్రభుత్వ ఖర్చుతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నవారికి అందిస్తున్న సేవలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. హాస్పిటల్స్ పూర్తిస్థాయి వైద్య సేవలు, సదుపాయాలు అందుబాటులోకి వచ్చేశాయి. గతంలో ఆరోగ్యశ్రీ వార్డ్ పేరుతో ప్రభుత్వ ఖర్చుతో వైద్యం చేయించుకునేవారిని ప్రత్యేకంగా చూసిన ఆస్పత్రులన్నీ కరోనా టైమ్ లో మాత్రం మానవత్వం చూపించాయి. పేదలకు మంచి వైద్యం అందించాయి. ప్రభుత్వ కనుసన్నల్లో కరోనా ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, అందుబాటులో వైద్యులు, ప్రమాణాలతో కూడిన ఔషధాలు, శానిటేషన్, నాణ్యతతో కూడిన ఆహారం, ఆరోగ్య మిత్ర.. ఇలా ఈ ఆరు ప్రమాణాలను కచ్చితంగా పాటించాయి.
దీనితో కరోనా తర్వాత కూడా ఈ ఆరు ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా చూడాలని, అలా పాటించినవారికే ఆరోగ్యశ్రీ అనుమతులు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.కోవిడ్–19 నివారణ చర్యలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కీలక ఆదేశాలు చేసారు. రోగులకు వైద్యం అందేలా చూడటంలో ఆరోగ్య మిత్రలు కీలకం. అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రల ను నియమించారా లేదా వారెలా పని చేస్తున్నారు అన్నది అధికారులు చూడాలి. ఒక రోగి ఆస్పత్రికి రాగానే ఆరోగ్యమిత్రలు వారి సమస్య తెలుసుకోవాలి. అక్కడ వారికి కావాల్సిన వైద్య సదుపాయం లేకపోతే ఏ ఆస్పత్రికి వెళ్లాలో సూచించి, అక్కడి వైద్యులతో మాట్లాడి.. రోగిని ఆ ఆస్పత్రిలో చేర్పించాలి.
తమకు కోవిడ్ సోకిందని ఎవరైనా భావిస్తే ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? అన్నది అందరికీ తెలియాలి. అందుకు ఇప్పుడు మనకు 104 కాల్ సెంటర్ ఉంది. ఈ కాల్ సెంటర్ మరింత సమర్థవంతంగా పని చేయాలి. అధికారులు ఈ కాల్ సెంటర్ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలి. ప్రతి రోజూ తప్పనిసరిగా మాక్ కాల్స్ చేయాలి. ఫోన్ చేసిన అర గంటలో బెడ్ కేటాయించాలి. హోం ఐసొలేషన్‌లో ఉన్న వారికి మెడికల్ కిట్లు అందాలి అని తెలిపారు. వచ్చే 15 రోజుల్లో ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవల ఆధారంగా గ్రేడింగ్ జరగాలి. ఆరోగ్యమిత్రల ఏర్పాటు, వారి సేవలను కూడా బేరీజు వేసి గ్రేడింగ్ ఇవ్వాలి. ఆయా ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించకపోతే, వాటిని ప్యానల్ నుంచి తొలగిస్తామన్న మెసేజ్ వెళ్లాలి. ఐవీఆర్‌ఎస్ ద్వారా పొందుతున్న ఫీడ్ బ్యాక్, డేటా మేరకు, ఆ తర్వాత వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది చాలా ముఖ్యం అని తెలిపారు. మొత్తమ్మీద ఆరోగ్యశ్రీలో ఇప్పటి వరకూ జరిగిన అవకతవకలకు కరోనా టైమ్ లో చెక్ పెట్టగలిగారు. కరోనా టైమ్ లో కార్పొరేట్ ఆస్పత్రులకు కొన్ని ప్రమాణాలు అలవాటు చేసి.. వాటిని కొనసాగించేలా చేస్తున్నారు.