ఆసుపత్రిలో చేరిన జగన్ పై హత్యాయత్నం నిందితుడు!

Update: 2019-04-23 17:06 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన జనుపల్లి శ్రీనివాసరావు ఆసుపత్రి పాలయినట్టుగా తెలుస్తోంది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారట జైలు అధికారులు. ఏపీ లో ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ పూర్తయ్యాకా - ఫలితాలు వెల్లడి కోసం అంతా వేచి ఉన్న సమయంలో శ్రీనివాసరావు ఆసుపత్రి పాలు అయ్యాడు. ఈ దశలో అతడు తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనట్టుగా వస్తున్న వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి.

చిన్న వయసు వాడే అయిన అతడు తీవ్రమైన అనారోగ్యం పాలయ్యాడనే వార్తలు విచిత్రంగానే అగుపిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ లో విశాఖ ఎయిర్ పోర్టులో కోడి కత్తి ద్వారా శ్రీనివాసరావు జగన్ మీద దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ ఉదంతం సంచలనం రేపింది.

అయితే ఆ వ్యవహారంపై ఏపీ డీజీపీ చాలా తేలికగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ వాళ్లు కూడా చాలా లైట్ తీసుకున్నట్టుగా మాట్లాడారు. ఇప్పటికీ వారు 'కోడి కత్తి పార్టీ'అంటూ ఎద్దేవా చేస్తూ ఉంటారు. ఆ
హత్యాయత్నాన్ని జగనే చేయించుకున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.

 అయితే ఆ విషయాన్ని నిరూపించలేకపోయినా కోడికత్తి పార్టీ అంటూ ఎద్దేవా మాత్రం ఆగడం లేదు. ఆ కేసు విచారణ ఎన్ఐఏ ఆధ్వర్యంలో అలా సాగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో శ్రీనివాసరావు ఆసుపత్రి పాలవ్వడం గమనించాల్సిన అంశంగా కనిపిస్తూ ఉంది.


Tags:    

Similar News