కర్ఫ్యూ టైం లో వేలం ఎలా నిర్వహిస్తారు : హైకోర్టు

Update: 2021-06-15 14:30 GMT
కరోనా వైరస్ విజృంభణ  సమయంలో వేలం ఏంటని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది. ఏపీలో దేవాదాయ భూములను బహిరంగ వేలం వేయాలన్న ఆదేశాలు సవాల్‌ చేస్తూ ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దేవాదాయ భూములను బహిరంగ వేలం వేయాలన్న ఆదేశాలు సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారించింది.

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా విధించిన కర్ఫ్యూ ఉండగా ఎలా బహిరంగ వేలం నిర్వహిస్తారని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. వేలం కోసం కృష్ణా జిల్లా పెద్ద కళ్లెపల్లిలో ఆలయం పిలిచిన టెండర్ ఆదేశాలు హైకోర్టు రద్దు చేసింది. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జులై7కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
Tags:    

Similar News