బాలయ్యకు డెడ్ లైన్ పెట్టిన ‘తమ్ముళ్లు’

Update: 2017-02-06 04:35 GMT
గడిచిన కొంతకాలంగా హిందూపురంలో నెలకొన్న అధికారపక్ష అసంతృప్త రాజకీయాలు.. తాజాగా తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు కమ్ బావమరిది.. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యకు.. అక్కడి స్థానిక తెలుగుదేశం పార్టీ అసంతృప్తి నేతలు తాజాగా డెడ్ లైన్ పెట్టారు. బాలయ్య పీఏ శేఖర్ ఆరాచకాలు రోజురోజుకి శ్రుతిమించటం.. ఇష్టారాజ్యంగా వ్యవహరించటంతో పాటు.. పలువురిని బెదిరిస్తున్న అతగాడి వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీడీపీ నేతలు  తాజాగా మీడియా ముందుకు వచ్చి..బాలయ్యకు డెడ్ లైన్ పెట్టేశారు.

‘‘వారం రోజులే డెడ్ లైన్. ఈ లోపు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తనకు పీఏ శేఖర్ కావాలో.. పార్టీ కావాలో తేల్చుకోని ఆయన్ను ఇక్కడి నుంచి పంపకపోతే పార్టీ పదవులకు రాజీనామా చేయటమే కాదు.. ఎన్టీఆర్ విగ్రహం ఎదుట నిరాహారదీక్ష చేస్తాం’’ అని ఓపెన్ గా డెడ్ లైన్ ఇచ్చేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారంటూ పీఏ శేఖర్ పై పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. దీనికి తగ్గట్లే రెండురోజుల క్రితమే ఒక కాంట్రాక్టర్ ను బెదిరించిన ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది.
Read more!

సదరు ఆడియో క్లిప్ లో.. బాలయ్య పీఏ శేఖర్ మాట్లాడిన మాటలు.. వాడిన భాష సంచలనం సృష్టించాయి. మరోవైపు టీడీపీ అసంతృప్త నేతలు భేటీ అయి.. సుదీర్ఘంగా చర్చించి.. పీఏ శేఖర్ విషయంలో బాలయ్యకు వారం డెడ్ లైన్ ఇచ్చారు. మరి.. ఈ వ్యవహారంపై బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News