ఈ 'కోడి' క‌థ‌ ను మీరు అంత ఈజీగా నమ్మలేరు

Update: 2022-12-29 23:30 GMT
కోడి గురించి..తెలుసుకునేది ఏముంటుంది? అని చాలా మంది అంటుంటారు. కానీ, నిజానికి తెలుసుకుంటే.. చిన్న చీమ గురించి కూడా వెయ్యి పేజీల పుస్త‌కం రాయొచ్చ‌ని.. నిరూపించాడు ప్ర‌పంచ యాంట్ మ్యాన్‌! అలానే.. కోడి గురించి కూడా తెలుసుకుంటే.. చిత్ర విచిత్రాలు చాలానే ఉంటాయి. మ‌న‌కు కోడి పందేల‌ప్పుడు.. వాటిలో ఉన్న గుర్తుకు వ‌స్తుంది. వాటిని వండుకుని తినేప్పుడు.. క‌మ్మ‌ద‌నం క‌నిపిస్తుంది... అంటే..అవ‌న్నీవిశేషాలే క‌దా!

అలానే.. కొన్నికొన్ని కోల్లు డిఫ‌రెంట్‌గా ఉంటాయి. అలాంటి కోడి క‌థే.. ఇప్పుడు దేశంలో వైర‌ల్ అవుతోంది. మ‌రి ఈ కోడి క‌థేంటో తెలుసుకుందామా.. సాధారణంగా ఒక కోడి రోజుకు ఎన్ని గుడ్లు పెడుతుంది? ఒక గుడ్డు లేదా రెండు గుడ్లు పెడుతుంది. పోనీ.. 10 అనుకుందాం. కానీ, మీరు చిత్రంలో చూసిన కోడి మాత్రం.. చాలా బ‌ల‌శాలి! ఏకంగా 31 గుడ్లు పెడుతోంది. అదీ కేవలం 12 గంటల్లోనే కావ‌డం విశేషం.  దీంతో ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో కూసి.. దేశం మొత్తం పాకింది.  

ఉత్త‌రాఖండ్‌లోని గిరీశ్ చంద్ర బుధాని అనే వ్యక్తి అల్మోరా జిల్లా బాసోత్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈయన ఓ టూర్ అండ్ ట్రావెల్స్‌ సంస్థలో పనిచేస్తున్నారు. ఇతనికి ఒక కోడి ఉంది. అది ఇటీవల రోజుకు రెండు గుడ్లు పెట్టింది. అయితే డిసెంబర్ 25న వరుసగా గుడ్లు పెడుతూనే ఉంది. సాయంత్రం ఇంటికొచ్చిన గిరీశ్ ఆశ్చర్యపోయాడు. అప్పటికి కోడి ఇంకా గుడ్లు పెడుతూనే ఉంది. మొత్తంగా రాత్రి 10 గంటల వరకు 31 గుడ్లు పెట్టింది. ప్రస్తుతం కోడి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

"ఈ కోడికి రోజూ 200 గ్రాములు వేరుశనగ గింజలు తింటుంది. ఆ గింజలను ఢిల్లీ నుంచి తెప్పిస్తాను. గింజలతో పాటు వెల్లుల్లినీ పెడుతుంటాం" అని గిరీశ్ తెలిపారు. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు.. కోడిని పరిశీలించేందుకు  వచ్చారు. అతడి నుంచి వివరాలు తెలుకున్న అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  ఇది ఆ ఒక్క రోజుతోనే ఆపేయ‌లేదు.. అప్ప‌టి నుంచి రోజూ.. ఇదే ప‌నిగా గుడ్డు మీద గుడ్డు పెడుతూనే ఉంద‌ట‌!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News