తెలంగాణ ఓటర్లలో సగం మంది యూత్ బాస్

Update: 2021-01-16 10:30 GMT
ప్రతి ఏడాది మొదట్లో కొత్త ఓటర్ల జాబితాను విడుదల చేస్తుంటారు. అంతకు ముందు సంవత్సరంలో కలిపిన ఓటర్లతో ఈ జాబితా విడుదల అవుతుంటుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను విడుదల చేశారు. గత ఏడాది 3 కోట్లుగా ఉన్న ఎన్నికల జాబితా తాజాగా లక్షలాది ఓటర్లు కొత్తగా జాయిన్ కావటంతో.. మొత్తం ఓటర్లు 3.01కోట్లుగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ ఓటర్లజాబితాను విడుదల చేశారు.

ఈ జాబితాను పరిశీలించినప్పుడు గత జాబితాతో పోలిస్తే.. 2,82,497 మంది అదనంగా ఓటుహక్కు పొందిన వైనాన్ని గుర్తించారు. కొత్త ఓట్లు 2.82 లక్షలు అదనంగా చేరగా.. జాబితా నుంచి 1.72లక్షల ఓట్లను తొలగించారు. రాష్ట్రంలో 33 జిల్లాలకు 20 జిల్లాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.

అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో పురుషులతో పోలిస్తే 68,628 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. అతి తక్కువగా జనగాం జిల్లాలో పురుషుల కంటే మహిళలు 750 అధికంగా ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మొత్తం ఓటర్లలో 18-39 ఏళ్ల మధ్యనే ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అంటే.. యువ ఓటర్లు మొత్తం ఓటర్లలో యాభై శాతం ఉండటం విశేషం.

మొత్తం ఓటర్లలో 18-49 ఏళ్ల మధ్య వారు అత్యధికంగా ఉన్నారు. వీరి సంఖ్య మొత్తం ఓటర్లలో 71.7 శాతం ఉండటం గమనార్హం. అదే సమయంలో అతి తక్కువగా 18 నుంచి 19 ఏళ్ల మధ్యలో ఉన్న వారున్నారు. ఈ విబాగంలో కేవలం 1,09,733 మంది ఓటర్లు ఉన్నారు.ఇక.. 80 ఏళ్లు దాటిన ఓటర్లు రాష్ట్రంలో 4.17లక్షల మంది ఉన్నట్లుగా తేలింది.
Tags:    

Similar News