ఇంతకూ చంద్రబాబు ఏ దేశంలో ఉన్నారు?

Update: 2019-06-23 06:09 GMT
మొదటి నుంచి చంద్రబాబు నాయుడి విదేశీ పర్యటన ఒకింత రహస్యంగానే ఉండటం ఆసక్తిదాయకంగా మారింది. చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలోనే ఆయన యూరప్ పర్యటనకు వెళ్లారని ప్రకటించింతి తెలుగుదేశం పార్టీ. మీడియాలో కూడా చంద్రబాబు నాయుడు యూరప్ పర్యటనలో ఉన్నారనే వార్తలే వస్తున్నాయి. యూరప్ అంటే ఏమీ దేశం కాదు కదా - ఆ ఖండంలో బోలెడన్ని దేశాలున్నాయి - వాటిల్లో చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నారనేది మాత్రం మిస్టరీగానే ఉండటం గమనార్హం.

ఈ పర్యటన విషయంలో గోప్యత పాటించే హక్కు చంద్రబాబు నాయుడుకు ఉంది. తను ఎక్కడికి వెళ్లిందీ చెప్పనక్కర్లేదు. అయితే ప్రజా జీవితంలో ఉన్న నేతల విషయంలో వారు విదేశాలకు వెళ్లినప్పుడు ఎక్కడ ఉన్నారనేది మాత్రం చర్చలో ఉంటుంది. దీంతో ఇంతకీ చంద్రబాబు నాయుడు ఏ దేశంలో ఉన్నారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఆయన విదేశీ పర్యటనలో ఉండగా.. ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఫిరాయింపు రాజకీయాలతో తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు పడుతూ ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన నుంచినే వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా తన పార్టీ వాళ్లకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఏదేశంలో ఉన్నారనేది మాత్రం రహస్యంగానే ఉండటం గమనార్హం.

చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు సంబంధించి విజయసాయి రెడ్డి కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు యూరప్ వెళ్లారని తెలుగుదేశం వాళ్లు చెబుతున్నారని - అయితే యూరప్ ఏమీ దేశం కాదు - ఖండం అనే విషయం అందరికీ తెలుసని - ఇంతకీ ఆయన స్విట్జర్లాండ్ వెళ్లారా - స్వీడన్ వెళ్లారా.. అనే అంశం ఎందుకు రహస్యంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు! అయినా ఈ అంశం గురించి టీడీపీ స్పందించడం లేదు.
Tags:    

Similar News