ఆ ఊర్లో దీపావళి నిషేధం.. కారణం ఏమిటంటే..?

Update: 2020-10-31 11:10 GMT
దసరా, దీపావళి తెలుగు ప్రజలకు పెద్దపండగలు. బంధుమిత్రులతో ఎంతో సంతోషంగా ఈ పండుగలను జరుపుకుంటూ ఉంటారు. కరోనా కారణంగా ఈ ఏడాది కొంతమేర పండగ ఉత్సాహం తగ్గింది. అయినప్పటికీ చాలా చోట్ల దసరా పండగ ఘనంగా జరుపుకున్నారు. ఇప్పటికే దసరా పండగ ముగిసింది. నవంబర్​ 14న దీపావళి జరుపుకోబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున దీపావళి వేడుకలు నిర్వహిస్తారు. ముఖ్యంగా వ్యాపారవర్గాలు ఈ పండగనాడు లక్ష్మీపూజలు నిర్వహించుకుంటారు. బాణాసంచా పేల్చడం, కొత్తబట్టలు ధరించడం నాలుగురోజుల పాటు ఈ పండగ జరుపుకుంటారు.

అయితే ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా రణస్థలి మండలం పున్నవపాలెంలో దీపావళి, నాగులచవితి నిషేధించారు. దాదాపు 200 ఏళ్లుగా అక్కడ ఈ రెండు పండగలు జరుపుకోరట. ఆ గ్రామంలో దీపావళి రోజున ఇంట్లో దీపాలు వెలగవు.  ఒక్క టపాసు కూడా పేలదు.  200 ఏళ్ల క్రితం ఆ గ్రామంలో దీపావళి పండగ రోజు ఓ చిన్నారి పాముకాటుతో మృతిచెందిందట. నాగుల చవితి రోజున రెండు ఎద్దులు మరణించాయట. దీంతో ఆ గ్రామంలో ఈ రెండు పండగలు జరుపుకోవద్దని అప్పట్లో పెద్దలు నిర్ణయించారు. ఆ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.  ఈ రెండు పండగలను అరిష్టంగా భావించి పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ రెండు పండగలు నిర్వహించుకోవడం లేదు. ప్రస్తుతం యువత దీపావళి వేడుకలు నిర్వహించాలని గ్రామపెద్దలపై ఒత్తిడి తెస్తున్నా, కట్టుబాట్లు మార్చేందుకు గ్రామపెద్దలు అంగీకరించడం లేదట.
Tags:    

Similar News