ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. టీ20లో 1000 సిక్సర్లు బాదిన గేల్

Update: 2020-10-31 13:10 GMT
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ నయా రికార్డు రాసాడు.ట్వంటీల్లో 1000 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. ఈ రికార్డ్ చూస్తే నిజంగా గేల్  కోసమే టీ 20 లీగ్ లు పుట్టాయా అని పిస్తోంది. ఈ లీగ్ లు లేక ముందు గేల్ పరిస్థితి దారుణంగా ఉండేది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు వార్షిక వేతనాలు కూడా చెల్లించలేని స్థితికి చేరడం తో అప్పుడప్పుడే మొదలవుతున్న టీ 20 లపై గేల్, పోలార్డ్, బ్రేవో, రస్సెల్ వంటి వారు దృష్టిపెట్టారు. అద్భుతమైన హిట్లర్లయిన వారంతా  ఈ ఫార్మాట్లలో అద్భుతంగా రాణించారు. ప్రపంచంలో ఏ మూల టి20 లీగ్ జరిగిన అక్కడికెళ్లి ఆడడం మొదలుపెట్టి విజయవంతమయ్యారు. ముఖ్యంగా గేల్ ఈ ఫార్మాట్లో అత్యద్భుతం గా రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్ లీగ్ లలో, ఐపీఎల్లో ఎవరూ అందుకోలేనన్ని రికార్డ్స్  నమోదు చేశాడు.  

గేల్ కి ఒకటి రెండు పరుగులు తీయడం కన్నా ఫోర్లు, సిక్సర్లు బాదడమే సులువు. ఇప్పటివరకు అతడు  ట్వంటీల్లో బౌండరీల ద్వారానే ఆరు వేల పరుగులు చేశాడంటే అతడు బ్యాటింగ్ ఎంత దూకుడుగా ఉంటుందో అర్థమవుతుంది. ట్వంటీల్లో ఇప్పటివరకు అతడు 10001 సిక్సులు బాదేశాడు. నిజంగా ఇది ఎవరూ అందుకో లేని రికార్డు.  ఈ సీజన్లో పంజాబ్ తరఫున ఆడుతున్న గేల్ కి ముందు తుది జట్టులో స్థానం దొరకడం బెంచ్ కే  పరిమితమయ్యాడు. పంజాబ్ జట్టు ఆడిన 6 మ్యాచ్ లలో ఐదింట  ఓటమి చెందడంతో గేల్ ఆడించ పోవడంపై విమర్శలు చెలరేగాయి. ఆ తర్వాత గేల్ జట్టులోకి వచ్చిన తర్వాత పంజాబ్ వరుసగా ఐపీఎల్ సాధించింది. ఈ విషయాల్లో గేల్ పాత్ర కూడా ఎంతో ఉంది. ఈ టోర్నీ లో మొత్తం 6 మ్యాచ్ లు ఆడిన గేల్ 276 పరుగులు చేశాడు.

 టీ20ల్లో  వెయ్యి సిక్సర్లు బాదేశాడు

 ట్వంటీ ల్లో 1000 సిక్సర్లు కొట్టిన ఫస్ట్‌‌ క్రికెటర్‌‌గా క్రిస్‌‌ గేల్‌‌ రికార్డు  క్రియేట్‌‌ చేశాడు. నిన్న  రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో   కార్తీక్‌‌ త్యాగి వేసిన 19వ ఓవర్లో కొట్టిన సిక్స్‌‌తో అతను వెయ్యి సిక్సర్ల మార్కు చేరుకున్నాడు. ట్వంటీ  ఫార్మాట్‌‌ లో (1001) సిక్సర్లు కొట్టిన బ్యాట్స్ మెన్ గా రికార్డు సాధించడు. గేల్ తర్వాత కీరన్‌‌ పొలార్డ్‌‌ (690) సెకండ్‌‌ ప్లేస్‌‌లో ఉండగా,  బ్రెండన్‌‌ మెకల్లమ్‌‌ (485), షేన్‌‌ వాట్సన్‌‌ (467), ఆండ్రీ రసెల్‌‌ (447) అత్యధిక సిక్సర్లు బాదిన  జాబితాలో ఉన్నారు.
Tags:    

Similar News