ఇక.. చైనా యూత్ కి పండుగే
ఆంక్షల దేశంగా పేరొందిన చైనాలో మిగిలిన విషయాలే కాదు.. పిల్లల్ని కనే విషయంలోనే ఆంక్షలే. ఆ దేశంలో అయితే పిల్లల్ని కనకుండా ఉండటం.. లేదంటే ఒకరిని మాత్రమే కనే వీలుంది. రెండో వారిని కనాలంటే చాలా పెద్ద ప్రొసీజరే ఉంది. చాలామంది చైనీయులు తమకు పిల్లల్ని కనే స్వేచ్ఛ లేనందుకు తెగ ఫీలవుతుంటారు. ఎవరైనా కానీ చట్టాన్ని అతిక్రమిస్తే భారీగా శిక్షలు తప్పవు.
అందుకే.. పిల్లల్ని కనాలని మనసులో ఎంతగా ఉన్నా.. చట్టానికి లోబడి బతికేస్తుంటారు. ఆ మధ్యన కొంతమంది పిల్లల్ని కనేందుకు అవకాశం కల్పిస్తూ పరిమితకాలపు ఆఫర్ పెడితే భారీగా దరఖాస్తులు వచ్చిన పరిస్థితి. ఇదిలా ఉంటే చైనీయులకు అమితమైన సంతోషాన్ని ఇచ్చేలా ఆదేశ ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయాన్ని వెలువరించింది. ఇప్పటివరకూ ఒక బిడ్డకు మాత్రమే కనే హక్కును సడలిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో.. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని కనేందుకు చైనీయులకు చట్టబద్ధమైన అడ్డంకులన్నీ తొలిగిపోయిన పరిస్థితి. చైనా సర్కారు తాజాగా ప్రకటించిన వన్ ప్లస్ వన్ ఆఫర్ తో చైనా యూత్ తెగ సంతోషపడిపోతుందట. ఇక.. చైనా యూత్ కి పండగే అన్న మాట. ఇంతకీ.. చైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి కారణమేమిటన్న విషయానికి వస్తే.. తాము ఇదే తీరులో జనాభా నియంత్రణ విషయంలో కఠినంగా ఉంటే.. త్వరలో తమను భారత్ అధిగమించే అవకాశం ఉన్నందున.. జనాభా వృద్ధికి పచ్చజెండా ఊపేసిందని చెబుతున్నారు.