ఎన్టీఆర్‌ ను పొగిడి తాను తిట్టించుకున్న చంద్రబాబు

Update: 2019-02-23 04:09 GMT
గంగలో మునకేస్తే అన్ని పాపాలు పోతాయంటారు.. చంద్రబాబు గంగలో మునిగారో లేదో కానీ ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచిన పాపం మాత్రం ఆయన్ను ఇంకా వెంటాడుతోంది. తాజాగా ప్రజలు మరోసారి ఆయన్ను ఈ విషయంలో చీ కొట్టారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ ను పొగిడినా కూడా జనం మాత్రం ఆయనపై తిట్ల వర్షమే కురిపించారు.
   
‘ఎన్టీఆర్’ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ సినిమా తాజాగా రిలీజైన సంగతి తెలిసిందే. ఇది పొలిటికల్‌ గా తనకు పనికొచ్చే సినిమా కావడంతో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నేతలకు చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు. టీడీపీ నేతలతో చంద్రబాబు శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన టీడీపీ ఆవిర్భావం నుంచి ఎదుర్కొన్న సంక్షోభాలపై తీసిన బయోపిక్ ‘మహానాయకుడు’ అని - నేటి తరానికి ఎన్టీఆర్ అంటే ఎవరో తెలియజెప్పే సినిమా ఇదని అన్నారు. టీడీపీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం ఓ సంచలనమని - తెలుగోడు ఢిల్లీని గడగడలాడించిన తీరు అందరికీ ఆదర్శమని కొనియాడారు. నాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే మనకు స్ఫూర్తి అని చంద్రబాబుఅన్నారు.
   
పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్సు కావడంతో మీడియాలో - సోషల్ మీడియాలో కూడా ఈ వార్త అందరికీ చేరింది. దీంతో సోషల్ మీడియాలో చంద్రబాబుపై నెటిజన్లు అటాక్ మొదలుపెట్టారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాగేసుకుని.. ఇప్పుడు ఆయనపై ప్రశంసలు కురిపిస్తావా అంటూ ఘాటైన కామెంట్లు పెట్టారు. ఎన్నికల ముందు ఎన్టీఆర్‌ ను వాడుకోవాలని చంద్రబాబు తలిస్తే నెటిజన్లు మాత్రం ఆయన వెన్నుపోటును గుర్తుచేస్తూ ఏకిపడేశారు. చంద్రబాబు - ఎన్టీఆర్ ఫొటోలతో ఎన్నో మీమ్స్ - వీడియోలు - కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తించారు.

Tags:    

Similar News