హే.. బాబు భయపడ్డాడు: వర్మ

Update: 2019-02-21 07:01 GMT
అవతలి వ్యక్తిని తన లాజికల్‌ ఆన్సర్స్‌ తో ఆడుకోవడం రామ్‌ గోపాల్‌ వర్మకు దెయ్యం సినిమాతో పెట్టిన విద్య. మొదటి నుంచి మంచి ఫైటర్‌ కావడంతో.. ఎవ్వరేమన్నా కరాట్‌ కిక్‌ లాంటి పంచ్‌ ఇమ్మిడియట్‌గా ఇస్తుంటాడు. అదిగో.. ఇప్పుడు అలాంటి పంచే ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకి ఇచ్చాడు వర్మ.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పై ఈ ఉదయం టెలీ కాన్ఫరెన్స్‌ లో చంద్రబాబు ప్రస్తావించారు. కొంతమంది ఎన్టీఆర్‌ చరిత్రను వక్రీకరించేలా కుట్రలు పన్నుతున్నారని, కుట్రదారుల ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా.. అసలు నిజాలు ప్రజలకు తెలిపేందుకు కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు తీశారని చెప్పుకొచ్చారు.

కాంట్రవర్సీ కోసం కళ్లప్పగించి ఎదురుచూసే వర్మకు.. చంద్రబాబు వ్యాఖ్యలతో అద్భుతమైన అవకాశం దొరికింది. అవకాశం దొరికితే వర్మ ఊరుకుంటాడా. చెలరేగిపోయాడు. చంద్రబాబు భయపడ్డాడు అని అర్థం వచ్చేలా ఒక వీడియోని తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అందులో ఒక విలేఖరి.. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పై వచ్చే రకరకలా రియాక్షన్స్‌ కి మీ నుంచి వచ్చే రియాక్షన్‌ ఏంటి సార్‌ అని అడుగుతాడు. దాని చంద్రబాబు కేరక్టర్‌ చేస్తున్న రానా.. ఎవ్వరేమన్నా సరే రియాక్ట్ కావొద్దు.. రియాక్ట్ కావొద్దు అనే డైలాగ్‌ ను జోడించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు వర్మ. దీంతో ఒక్కమాట కూడా మాట్లాడకుండా చంద్రబాబుకు అద్భుతమైన కౌంటర్‌ ఇచ్చాడు రామ్‌ గోపాల్‌ వర్మ.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News