బ్రేకింగ్: కవిత విచారణలో కీలక మలుపు

Update: 2023-03-20 19:40 GMT
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఉదయం నుంచి విచారణ ఎదుర్కొంటోంది. ఈ విచారణలో ఉత్కంఠ నెలకొంది. ఆమెను అరెస్ట్ చేస్తారా? అన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఈడీ కార్యాలయం లోపలికి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ఏజీతోపాటు ఇద్దరు న్యాయవాదులు వెల్లగా.. తాజాగా ఇద్దరు డాక్టర్లు వెళ్లారు.

సాధారణంగా అరెస్ట్ చేసేముందు నిందితులకు వైద్య పరీక్షలు చేస్తారు. అనంతరం అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తారు. ఈ క్రమంలోనే ఇద్దరు డాక్టర్లు రావడంతో మీడియాలో ఈ మేరకు కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఏడున్నర గంటలుగా కవిత విచారణ సాగుతోంది.

ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ, న్యాయవాదులు భరత్, గండ్ర మోహన్ వెళ్లారు. దీంతో క్షణక్షణం ఏం జరుగబోతోందనే ఉత్కంఠ నెలకొంది.

కాగా మనీష్ సిసోడియా సమా విచారణ ఎదుర్కొంటున్న ఇతరుల వైద్య పరీక్షల కోసం డాక్టర్లు వచ్చారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

8 గంటలుగా కవిత విచారణ సాగుతుండడంతో ఈడీ ఏం నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News