సైకో సూదిగాడి దాడిని అడ్డుకున్న ఆటోడ్రైవర్

Update: 2015-08-29 06:38 GMT
గత వారం రోజులుగా గోదావరి జిల్లాల్లోని వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సైకో సూదిగాడి బారి నుంచి తాజాగా ఓ ఆటో డ్రైవర్ తప్పించుకున్నాడు. దారిన వెళుతున్న మహిళలపై ఇంజెక్షన్ చేస్తూ.. దాడి చేస్తున్న ఈ సైకో ఇప్పటివరకూ ఆడాళ్ల మీదే టార్గెట్ చేశారు.

శనివారం అందుకు భిన్నంగా ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేసే యత్నం చేశాడు. దీన్నుంచి త్రుటిలో తప్పించుకున్న ఆటో డ్రైవర్.. పోలీసులకు ఈ ఉదంతం గురించి వివరించి.. ఫిర్యాదు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం అనాకోడేరులో ఒక ఆటోడ్రైవర్ మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు. అయితే.. ఈ దాడి నుంచి తప్పించుకున్న ఆటో డ్రైవర్ .. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేవలం వారం వ్యవధిలో ఇప్పటివరకూ సైకో సూదిగాడు దాదాపు 15 మందిపై ఇంజెక్షన్ దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. అతగాడ్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేయటంతో పాటు.. రివార్డు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News