ఆ ప్రముఖుడికి స్వలింగ సంపర్కం దేవుడిచ్చిన వరం!
స్వలింగ సంపర్కం చేస్తానన్నమాటను ఓపెన్ గా చెప్పే ప్రముఖుడు ఎవరైనా ఉన్నారంటే వెంటనే గుర్తుకు వచ్చేది ప్రఖ్యాత యాపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్. నిజానికి ఈ లోపాన్ని బాహాటంగా చెప్పే ధైర్యం ఎవరూ చేయరు. కానీ.. టిమ్ కుక్ కాస్త డిఫరెంట్. తనకున్న లోపాన్ని బయటకు చెప్పటం ద్వారా.. ప్రపంచానికి ఒక మేసేజ్ వెళ్లటమే కాదు.. ఇలాంటి ఇబ్బందితో ఉండే వారికి అంతో ఇంతో నైతిక స్థైర్యాన్ని ఇచ్చినట్లు అవుతుందన్నది ఆయన భావన.
ఈ కారణంతోనే తనకున్న స్వలింగ సంపర్కం అలవాటును బయటకు చెప్పేలా చేసింది. అయితే ఇదంతా అందరికి తెలిసిన పాత ముచ్చట. తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్య ఒకటి ఆసక్తికరంగా మారింది. స్వలింగ సంపర్కం తనకు దేవుడిచ్చిన వరంగా ఆయనిప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు.
స్వలింగ సంపర్కం తనకు మొదట్నించి అలవాటున్నప్పటికీ.. తన చేతిలోకి యాపిల్ పగ్గాలు వచ్చినంతనే ఆయన తనలోని బలహీనత(లోపం)ను బయటపెట్టేశారు. దీంతో.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకిలా తనలోని లోపాన్ని అంత బాహాటంగా చెప్పేశారన్న ప్రశ్నకు ఆయన ఇప్పటికే సమాధానం ఇచ్చారు.
చాలామంది తల్లిదండ్రులు తనకు వ్యక్తిగతంగా లేఖలు రాసేవారని.. తమ పిల్లలు స్వలింగ సంపర్కంఅన్న విషయాన్ని చెప్పి.. ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలని ప్రశ్నించేవారని.. అలాంటి వారికి నైతికస్థైర్యం కలిగించాలన్న ఉద్దేశంతో తాను తనలోని లోపాన్ని చెప్పినట్లుగా పేర్కొన్నారు. తనలోని లోపాన్ని బయటపెట్టేందుకు తాను తీసుకున్న నిర్ణయంపై తనకు గర్వంగా ఉందన్నారు.
తన అభిప్రాయం ప్రకారం అందరిని సమానంగా చూడాలని.. సమానమైన గౌరవం ఇవ్వాలని.. తన వ్యక్తిగత విషయాల గురించి బయటపెట్టాలని తాను అనుకోలేదని.. కానీ.. తనకు వస్తున్న లేఖల్ని చూసిన తర్వాత తన విషయాన్ని బయటకు చెప్పాలనిపించినట్లు ఆయన చెప్పారు.
తాను ఓపెన్ గా బయటకు చెప్పిన తర్వాత.. తనను ఉదాహరణగా తీసుకొని తనలాంటి ఎందరో వ్యక్తులు తమలోని లోపాన్ని ధైర్యంగా బయటకు చెప్పుకోగలుగుతారని తనకు అనిపించిందని అందుకే చెప్పినట్లుగా చెప్పారు. స్వలింగ సంపర్కులైన పిల్లలకు.. పెద్దలకు తాను చెప్పేది ఒక్కటేనని.. ఆ లోపం ఉన్నా జీవితంలో ఎంతటి గొప్ప ఉద్యోగానైనా చేయొచ్చన్నాడు. దానికి టిమ్ కుక్ కు మించినోళ్లు ప్రపంచంలో మరెవరుంటారు?