బ్రేకింగ్: ఏపీ కేబినెట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?

Update: 2020-09-30 17:32 GMT
ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. రేపు జరగాల్సిన ఈ కీలక భేటిని వాయిదా వేశారు. వచ్చే నెల అక్టోబర్ 8న ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగనుంది.

నిజానికి ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం అక్టోబర్ 1న జరగాలని నిర్ణయించారు. కేబినెట్ లో పలు అంశాలపై చర్చించాలని భావించారు. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అంశాలు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కూడా ఉంది.

అయితే తాజాగా అనివార్య కారణాల వల్ల కేబినెట్ సమావేశం వాయిదా పడినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. తిరిగి కేబినెట్ సమావేశం అక్టోబర్ 8న నిర్ణయించినట్లు పేర్కొంది.

కాగా రేపటి కేబినెట్ మీటింగ్ వాయిదా పడడానికి గల కారణాల గురించి మాత్రం అధికారికంగా ఏపీ ప్రభుత్వం వెల్లడించలేదు.
Tags:    

Similar News