అమెరికా వీసాకు 2 నెలల గ్రేస్ పీరియడ్

Update: 2016-12-02 07:05 GMT
ట్రంపు వస్తే కంపుకంపే అని ప్రపంచమంతా ఆందోళన చెందినా కూడా ఆయన రాకను ఎవరూ అడ్డుకోలేకపోయారు. దాంతో భారతీయులు వీసాలు - ఉద్యోగాల విషయంలో చాలా ఆందోళన చెందారు. కానీ, అలాంటి ఆందోళన అవసరం లేదన్నట్లుగా అమెరికా తాజాగా పలు అనుకూల నిర్ణయాలు తీసకుంది.  హెచ్ 1బీ వీసా టెర్మినేట్ అయ్యాక కూడా 60 రోజులు అక్కడే ఉండే వెసులుబాటు కల్పించింది. హెచ్ 1బీ వీసా ఉన్నవాళ్ల జీవిత భాగస్వాములుగా హెచ్ 4వీసాపై వచ్చేవాళ్లకూ ప్రయోజనం కలగనుంది.

నిజానికి ఇప్పటివరకు అమెరికా వీసా అంటే టెన్షన్ టెన్షే.  వీసా కాలంచెల్లితే..  అమెరికాలో ఉండే అవకాశం లేదు. దాన్ని పొడిగించుకునే ఛాన్సూ లేదు. కానీ, ఇక నుంచి అలా కాదు.  వీసాకు కాలం చెల్లినా  మరో అవకాశం ఉంటుంది. రెండు నెలల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవచ్చు. ఈ కొత్త నిబంధనతో చాలామంది ప్రయోజనం పొందబోతున్నారు.

రెండు నెలల కాలమంటే తక్కువేమీ కాదని... గట్టిగా ప్రయత్నిస్తే సులభంగా కొత్త ఉద్యోగం దొరుకుతుందని చెబుతున్నారు.  ఇక ఇప్పుడు హెచ్ 4 వీసాపై వచ్చే ఉద్యోగులు కూడా తమ వీసా గడువు ముగిశాక ప్రభుత్వం పొడిగింపు కోసం ఎదురు చూడక్కర్లేదని అంటున్నారు. ఈ నిబంధనలు జనవరి 17 నుంచి అమల్లోకి రానున్నాయి... అంటే అప్పటికి మూడు రోజుల తరువాత ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారన్నమాట.  మొత్తానికి ట్రంప్ అధ్యక్షుడయ్యే ముహూర్తంలో భారతీయులకు మంచి కానుకే దొరుకుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News