చైనాపై న్యూక్లియర్ దాడి చేయాలనుకున్న అమెరికా.. కానీ!
అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ దేశం చైనాకు మధ్య ఎప్పటి నుంచో చిచ్చు చెలరేగుతూనే ఉంది. తరతరాలు ఈ విద్వేషాలు కొనసాగుతున్నాయి. ఆఖరకు కరోనాను చైనా సృష్టించిందని.. యూఎస్ను దెబ్బతీయడానికే అనే వివాదం చెలరేగింది. ట్రంప్ అధ్యక్షతన ఈ పొరపొచ్ఛాలు ఉద్ధృతం అయ్యాయి. కానీ బైడెన్ వచ్చాక ఈ వాతావరణం కాస్త చల్లబడుతుందని అంతా అనుకున్నారు. అయితే పూర్తిగా సద్దుమణుగలేదని చెప్పవచ్చు.
ఇరు దేశాల సమావేశాలు జరిగినప్పుడల్లా ప్రతినిధుల మధ్య చర్చ నడుస్తూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. అయితే ఈ రెండు దేశాల విద్వేషాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి అంత త్వరగా సఖ్యత ఉండదని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో చైనాపై అమెరికా న్యూక్లియర్ దాడి చేయాలనుకుందనే వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన నష్టాల తర్వాత మళ్లీ ఆటంబాంబులను ప్రయోగించకూడదని అన్ని దేశాలు తీర్మానించుకున్నాయి. కానీ ఆతర్వాత ఒకసారి చైనాపై ఆటంబాంబు ప్రయోగించాలని అమెరికా యోచించినట్లు అమెరికన్ ఆర్థిక శాస్త్రవేత్త డేనియల్ ఎల్స్ బర్గ్ తెలిపారు. కమ్యూనిస్టు బలగాలు తైవాన్ ను ఆక్రమిస్తున్న నేపథ్యంలో ఈ న్యూక్లియర్ దాడులను చేయాలని అనుకున్నట్లు ఆయన వెల్లడించారు.
1985లో ఈ ఆలోచన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే గనుక జరిగితే చైనాకు రష్యా మద్దతు తెలుపుతుందని అమెరికాకు తెలుసునని ఆయన చెప్పారు. ఆ రెండు దేశాలు అమెరికాపై దాడి చేస్తాయని ఈ ప్రణాళిక రూపొందించిన నిపుణులు చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. అయినా అమెరికా న్యూక్లియన్ దాడికి సిద్ధపడిందని అన్నారు. అనంతరం కొన్ని కారణాల వల్ల విరమించుకుందని వెల్లడించారు.