మాఫియా డాన్ మళ్లీ పెళ్లికొడుకవుతున్నాడు

Update: 2015-06-30 11:07 GMT
    మాఫియా డాన్ అబూసలేంను పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువతి కోర్టుకెళ్లిన సంగతి తెలిసిందే.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి అబూసలేం అంగీకరించాడు. అబూసలేంను పెళ్లి చేసుకొనేందుకు అనుమతివ్వాలని ఓ 26 ఏళ్ల యువతి తన న్యాయవాది ఫర్హానా షా ద్వారా ప్రత్యేక టాడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం రిజిస్ట్రార్ ముందు తామిద్దరం పెళ్లి చేసుకునేందుకు అనుమతించాలని అబూసలేం సోమవారం కోర్టును కోరాడు.

 అబూసలేం ఆ యువతిని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు నిరుడు ఒక పత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై దర్యాప్తు సందర్భంగా పోలీసులు ఆమెతో సలీం కలిసి దిగిన ఫొటోను పలువురికి చూపించారు. దీంతో ఆమెకు అబూ సలేంతో సంబంధముందన్న ముద్ర పడింది. దాంతో ఆమెనెవరూ పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. తన కారణంగా ఆమెకు జరిగిన అవమానానికి, ఆమెను పెళ్లి చేసుకోవడం ద్వారా న్యాయం చేస్తానని అబూసలేం కోర్టుకు తెలిపాడు. అప్పుడే ఆమె సమాజంలో గర్వంగా తల ఎత్తుకుని తిరగగలదని పేర్కొన్నారు. అంతేకాదు... ఇంతకాలం జరిగిన నష్టానికి ఆమెకు క్షమాపణ కూడా చెప్పాడు.
Tags:    

Similar News