హైదరాబాద్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేకి చేదు అనుభవం...ఏమైందంటే!

Update: 2020-11-17 17:40 GMT
హైదరాబాద్ ను గత కొద్దీ రోజుల క్రితం , చరిత్ర ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు , భారీ వరదలు అతలాకుతలం చేశాయి. వరుసగా కొన్నిరోజుల పాటు భారీ వర్షం కురవడంతో హైదరాబాద్ మొత్తం సముద్రాన్ని తలపించింది. కాలనీళ్లన్ని కూడా చెరువుల్ని తలపించాయి. వరద నీళ్లల్లో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాగే మరికొంతమంది నిరాశ్రయులు అయ్యారు. దీనితో ప్రభుత్వం వరదల కారణంగా నష్టపోయిన వారికి పదివేల సాయం ప్రకటించింది. సాయం వితరణ లో అవకతవకలు జరగడంతో దీనిపై పెద్ద రచ్చ జరిగింది.

అయితే , గ్రేటర్ ఎన్నికలు ఉండటంతో వరద సాయం పొందటానికి మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీనితో వరద బాధితులు పెద్ద సంఖ్యలో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో అధికార టీఆర్ ఎస్ ‌ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కి ఘోర అవమానం జరిగింది. అసలేమైందంటే .. తన నియోజకవర్గంలోని వరద బాధితుల దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించడానికి ఓ మీ సేవ కేంద్రానికి వెళ్లారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. అయితే , ఈ వరద భాదితుల సాయం పై రచ్చ రచ్చ జరగడం తో ప్రభుత్వం పై తీవ్రమైన ఆగ్రహం లో ఉన్న భాదితులు ఒక్కసారిగా ఎమ్మెల్యే ను చూడగానే పట్టరాని కోపంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే ను చూడగానే అక్కడ ఉన్న మహిళలు భుతుపురాణం అందుకున్నారు. దీనితో అక్కడ ఉన్న పార్టీ కార్యకర్త వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆ వ్యక్తిని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టి వదిలిపెట్టడంతో ఇక చేసేదేమి లేక వచ్చిన దారినే ఎమ్మెల్యే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే , గ్రేటర్ ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చిన ఈ సమయంలో ఎమ్మెల్యే పై ఇంత వ్యతిరేకతను చూసి , టిఆర్ ఎస్ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన అయితే మొదలైంది.
Tags:    

Similar News